DIAL YOUR EO EXCERPTS _ డయల్ యువర్ ఇ.ఓ
డయల్ యువర్ ఇ.ఓ
తిరుమల, 07 జూన్ 2013: శుక్రవారం నాడు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఇ.ఓ కార్యక్రమంలో భక్తుల కొన్ని ప్రశ్నలు, సూచనలు వాటికి ఇ.ఓ శ్రీఎల్.వి.సుబ్రహ్మణ్యం స్పందన
1. నరసింహ – నల్గొండ
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల కొరకు దర్శనానంతరం తిరుపతికి వెళ్ళే బస్సులను నేరుగా రైల్వేస్టేషన్‌లో దించేట్లుగా ఏర్పాటు చేయగలరు.
ఇ.ఓ. ప్రస్తుతం ఆపనిమీదే తి.తి.దే తిరుపతిలో ‘సబ్ వే’ నిర్మాణ పనులను చేపట్టింది.
2. మురళి – హైదరాబాదు.
మా తల్లితండ్రులు ఏడేళ్ళ క్రితం రెండు అభిషేకం టికెట్లను అడ్వాన్సు బుక్కింగ్‌లో కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం వారు జీవించిలేరు. వారి సంతతిగా అభిషేకం సేవలో పాల్గొనే అవకాశం ఉందా?
ఇ.ఓ ఇప్పటి వరకు ఇటువంటి సంఘటన ఎదురు కాలేదు. ఆలోచించి మీకు తెలియపరుస్తాం.
3. ఉమేష్ – వేములవాడ
తి.తి.దే ఎస్.వి భక్తి ఛానల్‌లో చూపించే సేవల ప్రత్యక్ష ప్రసారం చాలా బాగున్నాయి. అయితే అర్చకుల మంత్రోచ్ఛరణలో అపశృతులు దొర్లకుండా చర్యలు చేపట్టగలరు.
ఇ.ఓ తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
4. రామ్మోహన్‌రావు – నల్గొండ
తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు స్వామివారి దర్శనం కొరకు క్యూలైన్లలో నిల్చోవడం ఒకఎతైతే, తలనీలాల క్యూలైన్లలో నిరీక్షణ కూడా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ సమస్యను అధిగమించడానికి తిరుపతిలోని వసతి గృహాల్లో కూడా మిని కల్యాణకట్టలను ఏర్పాటు చేయగలరు.
ఇ.ఓ ఇది చాలా విప్లవాత్మకమైన ఆలోచన, ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.
5. అశ్వత్ – బెంగుళూరు
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాస కార్యక్రమాలను కర్ణాటకలో కూడా ఏర్పాటు చేయగలరు.
ఇ.ఓ చాగంటివారిని సంప్రదించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం.
6. బాలరాజు – మెదక్
తి.తి.దే అన్నప్రసాద వితరణలో భక్తుల కొరకు పిండివంటలను కూడా వడ్డిస్తే బాగుంటుంది.
ఇ.ఓ ఆలోచిస్తాం.
ఈ కార్యక్రమంలో సి.వి.ఎస్.ఓ శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్, ఛీఫ్ ఇంజనీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమ అనంతరం ఇ.ఓ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర వైభవాన్ని థదిశలో వ్యాపించేయడంలో భాగంగా శ్రీనివాస కల్యాణాలను తి.తి.దే ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నదన్నారు. అంతే కాకుండా ఉత్తర భారతంలో కూడా శ్రీవారి వైభవాన్ని చాటే రీతిలో శ్రీవారి నమూనా ఆలయాలను, ధ్యానమందిరాలను నిర్మిస్తున్నదన్నారు. ఇటీవల మే 29వ తారీఖున డిల్లీలో శ్రీవారి ఆలయం ప్రారంభిస్తే, జూన్ 4వ తారీఖున కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన జరిగిందన్నారు. త్వరలో ఇదే రీతిలో డెహ్రాడూన్, కురుక్షేత్రం ‘చార్‌ధామ్’ (గంగోత్రి, యమునోత్రి, కేదారినాద్, భద్రినాద్) ముంబయి, అహ్మదాబాద్‌లలో కూడా శ్రీవారి ఆలయ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమౌతున్నాయన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల ‘నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ డిజైన్’ వారితో తిరుమల ఎస్.వి మ్యూజియం అభివృద్ధిపై సమావేశమైయ్యామన్నారు. తిరుమల మ్యూజియంలో భక్తులకు ఆధ్యాత్మిక ధ్యానాన్ని పెంచే రీతిలో, శ్రీవారి అవతార తత్వాన్ని తెలిపే రీతిలో భక్తుల మానసిక పరిస్థితిని చైతన్యవంతం చేసే రీతిలో ఎస్.వి మ్యూజియంను వినూతన రీతిలో తీర్చిదిద్ధన్నుట్లు తెలిపారు. ఈ మ్యూజింలో ఎటువంటి ఆభరణాలను ప్రదర్శనలో ఉంచాలనే విషయంపై త్వరలో సమావేశం కానున్నామని తెలిపారు. కాగా ఈ మ్యూజియం అభివృద్దికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక మరో మూడు మాసాల్లో సంసిద్ధత కానున్నట్లు తెలిపారు.
తిరుమలలో నినాదాలు భవ్యంకాదుః-
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి భక్తులు అనుదినం వస్తుంటారని ఇ.ఓ శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం అన్నారు. సాధారణంగా భక్తులసంఖ్య 50వేలకు మించకుండా ఉంటే ప్రతిఒక్కరికి సంతృప్తికర దర్శనం అందివ్వడానికి అవుతుందన్నారు. అయితే ఈ సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు దర్శన సమయంలో జాప్యం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు కూడా సంయమనాన్ని పాటిస్తూ తి.తి.దేకు సహకరించాలన్నారు. అంతేగాని దర్నాలు చేయడం, వ్యతిరేక నినాదాలు చేయడం ఎంత మాత్రం భావ్యంకాదని ఆయన హితవు పలికారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.