DIFFERENT DANCE FORMS ATTRACTS _ కల్పవృక్ష వాహన సేవలో ఆక‌ట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

DIFFERENT DANCE FORMS ATTRACTS

TIRUPATI, 01 DECEMBER 2024: On the 4th morning  the ongoing annual Karthika brahmotsavam at Tiruchanoor, different dance forms performed by various artists attracted the devotees.

 Braving the rain, the artist performed Peacock dance, Pot dance, Kuchipudi, Bharatnatyam, Kolatam besides portraying different mythological characters.

A total of 238 artists belonging to 10 groups performed in front of Kalpavriksha Vahanam on Sunday morning.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కల్పవృక్ష వాహన సేవలో ఆక‌ట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, 2024 డిసెంబరు 01: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉద‌యం కల్పవృక్ష వాహనసేవలో వివిధ రాష్ట్ర‌ల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 10 కళాబృందాలు, 238 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు.

చిరుజల్లుల మధ్య ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు నవదుర్గల వేషధారణ, కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించారు.
కర్ణాటకకు చెందిన 27 మంది కళాకారులు క్షీరసాగర మథనం, వివిధ పౌరాణిక పాత్రలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.

అదేవిధంగా నెమలి నృత్యం, కుండల నృత్యం, కడప డ్రమ్స్, కోలాటాలు నయనానందకరంగా సాగింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.