DISTRIBUTION OF SRIVARI LADDU AND VADDA PRASADAM TO TTD EMPLOYEES FROM OCTOBER 15 TO 24 _ అక్టోబర్ 15 నుండి 24వ తేదీ వ‌ర‌కు టిటిడి విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ

Tirupati, 14 October 2025: TTD will distribute Srivari Laddu and Vada prasadam to retired TTD employees and family pensioners from October 15 to 24. 

The prasadam will be given at the New Jabili Building, near TTD Canteen, Tirupati, from 10.30 AM to 5 PM. Beneficiaries must bring their TTD Smart ID cards. Each person will receive one big laddu and one vada.

Distribution as per PPO numbers:

Oct 15 & 16: 

PPO Nos. 164 – 5500

Oct 17: 

PPO Nos. 5501 – 7000

Oct 18: 

PPO Nos. 7001 – 8500

Oct 22: 

PPO Nos. 8501 – 10000

Oct 23: 

PPO Nos. 10001 – 12500

Oct 24: 

PPO Nos. 12501 and above

Retired employees and family pensioners are requested to collect the prasadam as per the schedule.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అక్టోబర్ 15 నుండి 24 తేదీ వ‌ర‌కు టిటిడి విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ

తిరుపతి, 2025, అక్టోబర్ 14: తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల అనంతరం టిటిడి విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని అక్టోబర్ 15 నుండి 24వ తేదీ వ‌ర‌కు అందించ‌నున్నారు. తిరుపతిలోని టిటిడి క్యాంటీన్ వ‌ద్ద గ‌ల కొత్త జాబిలి భ‌వ‌నంలో ఉద‌యం 10.30 గంట‌ల నుండి సాయంత్రం 05.00 గం.ల వరకు వారి వారి టిటిడి స్మార్ట్ ఐడీ కార్డులతో ప్ర‌సాదాలను స్వీకరించాలని టిటిడి కోరుతోంది.  టిటిడి పింఛన్‌దార్లు / వారి కుటుంబ పింఛన్ దారులు / సిపిఎస్ వారికి ఒక‌ పెద్ద లడ్డూ, ఒక‌ వడ అందజేస్తారు.

పిపిఓ నంబ‌ర్ల వారీగా ప్ర‌సాదాల పంపిణీ జ‌రుగుతుంది. అక్టోబర్ 15 మరియు 16 తేదీలలో 164 నుండి 5,500 వరకు, అక్టోబర్ 17వ తేదీన 5,501 నుండి 7,000 వరకు, అక్టోబర్ 18న 7,001 నుండి 8,500, అక్టోబర్ 22న 8,501 నుండి 10,000 వరకు, అక్టోబర్ 23వ తేదీన 10,000 నుండి 12,500 వరకు, అక్టోబర్ 24వ తేదీన 12,500 నుండి మిగిలిన పిపిఓ నెంబర్ల వారికి  ప్ర‌సాదాలు అందిస్తారు.

విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.