DIVINE BLESSINGS OF GODDESS PADMAVATHI ON GOLDEN CHARIOT _ స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం
Tirupati, May 01, 2026: The Golden Chariot procession of Goddess Padmavathi was held grandly on Friday morning as part of the Vasanthotsavams at Tiruchanoor.
The Goddess was seated on the golden chariot and blessed devotees amid chants of “Govinda” and a spiritual atmosphere.
After Vedic rituals, the processional deity was taken on the chariot through the four mada streets. A large number of women devotees enthusiastically pulled the chariot and offered harathi.
Temple officials, priests, and a large number of devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం
గోవింద నామస్మరణల మధ్య దివ్య దర్శనానందం
తిరుపతి, 2026 మే 01: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు దివ్య కటాక్షం ప్రసాదించారు.
ఆలయంలో వైదిక కార్యక్రమాల అనంతరం అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని శాస్త్రోక్తంగా స్వర్ణరథంపై ప్రతిష్ఠించారు. అనంతరం నాలుగు మాడ వీధుల్లో స్వర్ణరథం సంచరించగా, భక్తుల గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ప్రత్యేకంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అపార భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగడం విశేష ఆకర్షణగా నిలిచింది. కర్పూర హారతులు సమర్పిస్తూ అమ్మవారి దివ్య దర్శనంతో భక్తులు ఆధ్యాత్మికానందంలో మునిగిపోయారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరేంద్రనాథ్, ఎస్ ఈ శ్రీ నరసింహ మూర్తి, ఏఈఓ శ్రీ దేవరాజులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్ రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి తదితర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది









