DIVINE CHANTS REMOVES SINS _ భగవన్నామస్మరణతో కష్టాలు దూరం

•  SRI VIDYADEESHA THEERTHA SWAMIJI

•  TALENT AWARDS FOR 12 YOUNG ARTISTS

Tirumala, 09 February 2024: Udipi Palimaru Mutt Pontiff HH Sri Sri Sri Vidyadeesha Theertha  Swamiji said that if one does chants Harinama in Kaliyuga then he or she will be absolved from all problems, no matter how difficult it may be. 

As part of the Sri Purandaradasa Aradhana Mahotsavam, on the second day on Friday Swamiji gave blessings through his Anugraha Bhashanam in the event that was held grandly at the Asthana Mandapam in Tirumala.

He said Sri Purandardasa’s life is exemplary for mankind. He explained that through Dasa’s words, God’s philosophy, method of surrender, dharma and moral values ​​were conveyed in an easy way for everyone can understand through Sankeertans.

Later Palimaru Mutt Uttaradhikari Sri Sri Sri Vidyarajeshwa Theertha Swamiji along with the senior Pontiff jointly presented the talent awards to 12 young artists who have contributed significantly in Dasa literature.

Earlier, under the guidance of Sri PR Ananda Theerthacharya, Special Officer of the Dasa Sahitya Project, programs were organized in the morning including Suprabhata, Dhyana, Samuhika Bhajan and Nagara Sankirtana.

3500 Bhajan Mandali members from Andhra, Telangana, Tamil Nadu and Karnataka states participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భగవన్నామస్మరణతో కష్టాలు దూరం

•⁠ ⁠శ్రీ విద్యాదీశ తీర్థ స్వామీజీ

•⁠ ⁠12 మంది యువ క‌ళాకారుల‌కు ప్ర‌తిభ పుర‌స్కారాలు

తిరుమ‌ల, 2024 ఫిబ్ర‌వ‌రి 09: కలియుగంలో యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయకపోయినా హరినామస్మరణ చేస్తే ఎంతటి కష్టమైనా దూరం అవుతుందని ఉడిపి పా‌లిమారు మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యాధీశ‌తీర్థ స్వామీజీ తెలిపారు. శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు రెండ‌వ రోజైన శుక్ర‌వారం తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో ఘనంగా జ‌రిగాయి

ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యాధీశ‌తీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ, పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు. కేవలం ధనార్జనే ప్రధానంగా భావించిన వ్యక్తి తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల ద్వారా జ్ఞానసిద్ధిపొంది ప్రఖ్యాత హరిదాసులుగా ఖ్యాతిచెందారన్నారు. దాస పదాల ద్వారా అందరికీ అర్థమయ్యేలా సులువుగా భగవంతుని తత్వాన్ని, శరణాగతి విధానాన్ని, ధ‌ర్మాన్ని, నైతిక విలువ‌లను తెలియజేశారని వివ‌రించారు.

అనంత‌రం దాస సాహిత్యంలో విశేష కృషి చేసిన 12 మంది యువ క‌ళాకారుల‌కు ప్ర‌తిభ పుర‌స్కారాలు శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యాధీశ‌తీర్థ స్వామీజీ, పా‌లిమారు మ‌ఠం ఉత్త‌రాధికారి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యారాజేశ్వ‌తీర్థ స్వామిజీ క‌లిసి అంద‌జేశారు.

అంతకుముందు దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ పిఆర్ ఆనంద తీర్థచార్యులు ఆధ్వ‌ర్యంలో ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3500 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.