• GOLDEN MUKHA PATTI PRESENTED
Vontimitta / Tirupati, April 01, 2026: On the occasion of the celestial Sri Sita Rama Kalyanam at Vontimitta in Kadapa district, the precious gifts from Sri Venkateswara Swamy reached on Wednesday evening.
A golden Mukha Patti weighing around one kg to the main deity and a silver pot weighing about 2 kg were presented as a ”Marriage Gift” from Srivaru..
It is a tradition for TTD affiliated temples to send gifts from Tirumala Srivari Temple on the occasion of Brahmotsavam.
The TTD Chairman Sri BR Naidu and EO Sri M. Ravichandra performed pujas to the ornaments in front of the temple,
and handed them over to Vontimitta Sri Kodandarama Swamy temple authorities.
JEO Sri Veerabrahamam and other officials participated in the program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ సీతారాములకు తిరుమల శ్రీవారి దివ్య కానుకలు
• మూలవర్లకు స్వర్ణ ముఖ పట్టి బహూకరణ
ఒంటిమిట్ట / తిరుపతి, 2026 ఏప్రిల్ 01: ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివారు బుధవారం కానుకలు పంపారు .
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ శుభ సందర్బంగా మూలవర్లకు అలంకరించేందుకు ఒక కేజి బరువు గల స్వర్ణ ముఖ పట్టి, 2కేజిల బరువు గల వెండి బింది కానుకగా అందించారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం ఈ ఆభరణాలు సమర్పించారు.
ఆలయం ముందు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీవీరబ్రహ్మం, జేఈవో శ్రీ శరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది






