DIVINE LOOK TO ALL SUB ENQUIRY OFFICES IN TIRUMALA -TTD EO _ తిరుమల ఉప విచారణ కార్యాలయాలకు ఆధ్యాత్మిక శోభ : టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirumala,11 May 2022: TTD EO(FAC) Sri AV Dharma Reddy on Wednesday urged TTD officials to provide divine look to all TTD sub enquiry offices at Tirumala.
Addressing his first review meeting with senior officials after assuming full charge as EO, he called for a comprehensive report on functioning of health department on garbage clearance, their schedules and other issues.
He also directed engineering officials to expedite the structural design and architectural design work of the Matrusri Tarigonda Vengamamba Dhyana Mandiram.
He instructed the OSD of publication wing to publish Hanumanta birth place book in several languages and also to prepare and publish a summary of the book Sri Venkateswara Vrata Vidhana. He also directed SVBC Officials to telecast on the significance of Venkateswara Vratam for the sake of devotees and update the same in the website also.
He asked officials to take up digitisation of thousands of documents with TTD and preserve them with available technology.
Among others he wanted the Sapthagiri magazine to publish articles with apt headlines to attract youth. He said a separate session on existing stocks and sale of Panchagavya products,dry flower portraits will be dealt with.
TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, SVIMS Director Dr Vengamamma, FA & CAO Sri O Balaji, CE Sri Nageswara Rao, CAO Sri Sesha Shailendra, SVBC CEO Sri Suresh Kumar and other officials were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI
తిరుమల ఉప విచారణ కార్యాలయాలకు ఆధ్యాత్మిక శోభ : టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2022 మే 11: ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే తిరుమల వసతి ఉప విచారణ కార్యాలయాలను ఆధునీకరించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని ఇంజినీరింగ్ అధికారులను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆదేశించారు . తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈవో తొలి సీనియర్ అధికారుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల ఆరోగ్య విభాగంలో పని చేసే పారిశుద్ధ్య సిబ్బంది డ్యూటీ సమయాలు, ఏ విధంగా పారిశుద్ధ్యం నిర్వహిస్తున్నారు, వారి నిర్వహణ షెడ్డ్యూల్, మెరుగైన పారిశుధ్యం తదితర అంశాలకు సంబంధించి నిపుణులతో సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణానికి సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు .
హనుమంతుని జన్మ స్థలంపై వివిధ అంశాలతో కూడిన గ్రంథాలను పలు భాషల్లో ముద్రించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారిని ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర వ్రత విధానం అనే గ్రంథం ఇటీవల పండితులు సిద్ధం చేశారని, ఆ గ్రంథం సారాంశాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రచురణల విభాగం పుస్తకాలు ముద్రించాలని, ఎస్వీబిసిలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయాలని, టీటీడీ వెబ్ సైట్ లో పొందు పర్చాలన్నారు. తద్వారా లక్షలాది మంది భక్తులకు శ్రీ వేంకటేశ్వర వ్రత విధానంపై అవగాహన కలుగుతుందని ఆయన తెలిపారు.
టీటీడీలో ఉన్న వేలాది రికార్డులను డిజిటలైజేషన్ చేసి, భద్రపరచి భావితరాలకు అందించేందుకు ప్రిజర్వేషన్ టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. సప్తగిరి మాసపత్రికలో ముద్రించే శీర్షికలు పిల్లలకు, యువతకు ఉపయోగపడే విధంగా చక్కటి సారాంశంతో రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పంచగవ్య ఉత్పత్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజితో తయారు చేసిన ఫోటో ఫ్రేమ్‌లు రోజు వారి తయారీ, విక్రయం, ఎంత నిల్వ ఉంది అనే అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఈవో అన్నారు.అదేవిధంగా తిరుమలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు , వివిధ విభాగాల పనితీరు, తదితర అంశాల పై సమీక్షించారు.
జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఎఫ్ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజి, సిఇ శ్రీ నాగేశ్వరరావు, సిఎవో శ్రీ శేష శైలేంద్ర, ఎస్వీబిసి సిఇవో శ్రీ సురేష్ కుమార్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.