DO NOT CONTRIBUTE TO PRIVATE ORGANISATIONS FOR ANNADANAM-TTD APPEALS _ అన్నదానం పేరిట ప్రయివేటు సంస్థలకు విరాళాలు ఇవ్వకండి _ భక్తులకు టిటిడి విజ్ఞప్తి
TTD ALONE PROVIDES FREE ANNAPRASADAM DISTRIBUTION AT TIRUMALA DURING SRIVARI BRAHMOTSAVAM
TTD CAUTIONS DEVOTEES OVER FAKE ADVERTISEMENTS ON ANNADANAM
Tirumala,18 September 2022: TTD has cautioned devotees against contributions to private organizations publicizing their intention to perform Annadana during Srivari Brahmotsavam at Tirumala.
In a statement on Sunday, TTD said a private organization named Anant Govinda Dasa Trust of Secunderabad has sought donations from devotees for the purpose of Annadana at Tirumala during the ensuing Srivari Brahmotsavam. The trust has also opened a bank account number for this purpose.
TTD categorically stated that it has no connection with the above Trust and devotees should not trust in the claims made by any such organizations and individuals.
TTD also warned that it will take legal action against such persons and institutions which raises donations illegally.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టిటిడి ఉచితంగా అన్నప్రసాద వితరణ
అన్నదానం పేరిట ప్రయివేటు సంస్థలకు విరాళాలు ఇవ్వకండి
భక్తులకు టిటిడి విజ్ఞప్తి
తిరుమల, 2022 సెప్టెంబరు 18 ;తిరుమలలో సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టిటిడి ఉచితంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనుందని, అన్నదానం పేరిట ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు విరాళాలు అడిగితే ఇవ్వరాదని టిటిడి భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో అన్నదానం చేస్తామంటూ సికింద్రాబాద్‌కు చెందిన అనంతగోవిందదాస ట్రస్టు భక్తుల నుండి విరాళాలు కోరడాన్ని టిటిడి గుర్తించింది. ఇందుకోసం బ్యాంక్ అకౌంట్ నంబరును కూడా సదరు ట్రస్టు అందుబాటులో ఉంచింది. ఈ ట్రస్టుతో టిటిడికి ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి సంస్థలు, వ్యక్తుల మాటలు నమ్మవద్దని భక్తులను కోరడమైనది. అక్రమంగా విరాళాలు సేకరించే ఇలాంటి ట్రస్టులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టిటిడి తెలియజేస్తోంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.