DONATION POUR INTO TTD TRUSTS _ టీటీడీకి రూ.2.45 కోట్లు విరాళం
DEVOTEE FROM SRILANKA ALSO DONATESTirumala, 27 March 2025: The donations to the tune of Rs. 2.45cr pour into various Trusts of TTD on Thursday.
టీటీడీకి రూ.2.45 కోట్లు విరాళం
తిరుమల, 2025, మార్చి 27: టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గురువారం రూ.2.45 కోట్లు విరాళంగా అందింది.
చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్ ఫ్రా వెంచర్స్ సంస్థ టీటీడీ ఎస్ వి
అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించగా, శ్రీలంకకు చెందిన ఓ దాత అన్న ప్రసాదం ట్రస్టుకు మరో రూ.కోటి విరాళంగా అందించారు.
నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.