DR.B.KISHORE SWORN IN AS TTD BOARD EX-OFFICIO _ తితిదే ఎక్స్‌ అఫిషియో సభ్యునిగా శ్రీ బి.కిషోర్‌ ప్రమాణ స్వీకారం

TIRUMALA, June 3: The 1994-Batch IAS Officer, Dr.B.Kishore, Commissioner of Endowments(in charge), Govt. of AP, sworn in as the ex-officio member of TTD trust board on Monday.
 
The TTD Executive officer Sri LV Subramanyam administered the oath of office to Dr. B.Kishore at the Bangaru Vakili of the Tirumala temple on Monday morning at around 7:30am. After fulfilling the formalities, Dr. Kishore offered prayers to Lord Venkateswara. Later the vedic pundits offered Veda Asirvachanams inside Ranganayakula Mandapam. TTD Dy EO Sri Chinnamgari Ramana offered prasadams, calendar and diary to the new ex-officio member.
 
Reception Officials Sri Venkataiah, Sri Damodaram and other officials were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తితిదే ఎక్స్‌ అఫిషియో సభ్యునిగా శ్రీ బి.కిషోర్‌ ప్రమాణ స్వీకారం

తిరుమల, జూన్‌ 03, 2013: ఆంధ్రప్రదేశ్‌ సర్వే సెటిల్‌మెంట్‌ మరియు ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ బి.కిషోర్‌ ప్రభుత్వాదేశాలతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించడంతో సోమవారం శ్రీవారి ఆలయంలో స్వామివారి సమక్షంలో తితిదే ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం లోపల తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం డాక్టర్‌ బి.కిషోర్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దర్శనానంతరం శ్రీ కిషోర్‌కు మరియు కుటుంబ సభ్యులకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, ఆధ్యాత్మిక పుస్తకాలను, సిడీలను శ్రీ కిషోర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ కిషోర్‌ మాట్లాడుతూ స్వామివారి కృపాకటాక్షాలతో తనకు దేవాదాయ శాఖ కమిషనరుగా అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశం లభించిందన్నారు. భగవంతుడు అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తితిదే ఎక్స్‌ అఫిషియో సభ్యునిగా భక్తులకు సేవ చేస్తానని ఆయన తెలిపారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.