e-AUCTION OF WATCHES _ జూన్ 26న వాచీలు ఈ-వేలం
TIRUPATI, 17 JUNE 2023: The e-Auction of watches which were offered in Tirumala and other temples of TTD will take place on June 26.
A total of 1135 pieces in 26 lots comprising Titan, Casio, Timex, Alwyn, Sonata, Timewell, and Fasttrack watches which are new, used and partially damaged will be auctioned.
For more details contact 0877 2264429 or log onto www.tirumala.org/ www.konugolu.ap.gov.in
జూన్ 26న వాచీలు ఈ-వేలం
తిరుపతి, 17 జూన్ 2023: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను జూన్ 26న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి.
కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 26 (1135 నంబర్లు ) లాట్లు ఈ-వేలంలో ఉంచారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.