EFFECTIVE MEASURES TO CONTROL CORONA VIRUS IMPACT- TTD EO _ క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirupati, 13 March 2020: TTD has rolled out effective measures to check the impact of Corona Virus, said TTD Executive Officer Sri Anil Kumar Singhal.

On Friday morning he inaugurated the Corona Virus Awareness and Counselling Centre at Alipiri Check Point along with Addnl.EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti and said as a part of state and central government initiatives against spread of corona virus, TTD has scaled up steps to arrest its impact in Tirumala as the Hill Town is visited by scores of pilgrims everyday from across the country.

The EO said that the Honourable Chief Minister Sri YS Jagan Mohan Reddy and health secretary of the state health department reviewed and made several suggestions to TTD. Accordingly corona virus prevention camps have been set up with thermal scanning testing at Alipiri check point, near Padala mandapam at Alipiri footpath route and also at Srivari mettu footpath route. “If any symptoms are identified, the pilgrim will be stopped from entering Tirumala and diverted to isolation wards at Ruia hospital for medication “, he added.

Similarly, corona virus awareness programs were organised since last one week under guidance of Additional EO Sri AV Dharma Reddy in Tirumala, he said.

CLEANING WITH DISINFECTANTS:

The EO said special focus has been laid on sanitation and cleaning is taken up at an interval of every two hours in Tirumala where pilgrim congregation is more including PACs, Anna Prasadam complex, Vaikuntam queue complex and Kalyanakattas. 

OPTIONS FOR CHANGE OF DARSHAN TICKETS:

TTD has provided option of change of dates or refund on cancellation for devotees holding arjitha seva, Rs.300 darshan and accommodation that are booked in advance till May 31.

In view of Government of India not issuing visas to foreigners till April 15, TTD has also appealed to both NRIs and foreigners to postpone their pilgrimage to Tirumala for 28 days from the day they stepped in India.

PADMAVATHI NILAYAM AS ISOLATION WARD

The EO said on the appeal of State Health Secretary, the Padmavati Nilayam at Tiruchanoor has been allowed to be utilised as Isolation ward in view of Corona Virus threat. If needed the TTD choultries near Tirupati railway station will also be allotted for the same purpose upon the request of District Collector.

EXTENSIVE PUBLICITY:

The TTD EO said one lakh hand bills were distributed every day and non-stop broadcast of precautionary steps are being arranged throughout the day at Tirumala for the awareness of the pilgrims.

He said the crowd rush to Tirumala has reduced and devotees with time slots could have easy darshan without waiting in the Vaikuntam queue lines.

As a matter of abundant precaution in view of Corona, it has been instructed to allow only 250 devotees in each compartment of Vaikuntham Queue Complex as against the usual figure of 450-500 people to avoid infectious spread if any.  

Special precautionary steps for devotees are being telecasted through SVBC channel in waiting compartments and other platforms and health and medical departments of TTD are fully equipped with all emergency materials, he noted.

TTD additional CVSO Sri Siva Kumar Reddy, SE2 Sri Nageswara Rao, Health Officer Sri Dr RR Reddy, Chief Medical Officer Dr Nageswara Rao, Central Hospital medical Superintendent Dr Kusuma Kumari and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుప‌తి, 2020 మార్చి 13: దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌ని, ఇందులో భాగంగా టిటిడిలో ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్ల‌డించారు. తిరుప‌తిలోని అలిపిరి చెక్‌పాయింట్ వ‌ద్ద శుక్ర‌వారం క‌రోనా వ్యాప్తి నివార‌ణ వైద్య శిబిరాన్ని ఆయన‌ సంద‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ  క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు గౌ.ముఖ్య‌మంత్రివ‌ర్యులు, రాష్ట్ర‌ ఆరోగ్య విభాగం ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్షించి టిటిడికి ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్టు తెలిపారు. అలిపిరి చెక్‌పాయింట్‌, అలిపిరి న‌డ‌క‌మార్గంలోని పాదాల మండ‌పం, శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గం వ‌ద్ద క‌రోనా వ్యాప్తి నివార‌ణ వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి భ‌క్తుల‌కు థ‌ర్మ‌ల్ స్కానింగ్ ద్వారా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ల‌క్ష‌ణాల‌ను ప్రాథ‌మికంగా గుర్తిస్తే తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌కుండా రుయా ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డుకు పంపుతున్నామ‌ని తెలిపారు. తిరుమ‌ల‌కు రోజువారీగా వేలాది మంది యాత్రికులు వ‌స్తుంటారు కావున‌ వారం రోజుల నుండి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో క‌రోనా వైర‌స్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని వివ‌రించారు. ఇందుకోసం ఆరోగ్య‌, వైద్య విభాగాల ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌న్నారు.

ప్ర‌తి 2 గంట‌ల‌కోసారి ప‌రిశుభ్ర‌త చ‌ర్య‌లు
 
తిరుమ‌ల‌లో పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌ని, భ‌క్తులు ఎక్కువ‌గా ఉండే పిఏసిలు, అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, క‌ల్యాణ‌క‌ట్ట త‌దిత‌ర ప్రాంతాల్లో ప్ర‌తి 2 గంట‌ల‌కోసారి ప‌రిశుభ్ర‌త(శానిటైజ్‌) చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించామ‌ని ఈవో తెలిపారు. వ‌స‌తి గ‌దులను భ‌క్తులు ఖాళీ చేసిన త‌రువాత ఒక గంట పాటు స‌రైన విధంగా శుభ్రం చేసిన త‌రువాత మ‌రొక‌రికి కేటాయించాల‌ని సూచించిన‌ట్టు చెప్పారు.

ద‌ర్శ‌న టికెట్ల తేదీల‌ను మార్చుకునే అవ‌కాశం

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి మే నెల 31వ తేదీ వ‌ర‌కు ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందిన భక్తులకు త‌మ ద‌ర్శ‌న తేదీలు మార్చుకునే వెసులుబాటును, ర‌ద్ధు చేసుకుంటే న‌గ‌దు రీఫండ్ పొందే సౌక‌ర్యాన్ని క‌ల్పించామ‌ని ఈవో తెలిపారు. భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వివిధ దేశాల నుండి వ‌స్తున్న యాత్రికుల‌కు ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు వీసాలు ర‌ద్దు చేసిందన్నారు. విదేశాల నుండి వ‌చ్చిన‌ భారతీయులు గానీ, విదేశీయులు గానీ తిరుమల ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవాల‌ని విజ్ఞప్తి చేశారు.

ఐసోలేష‌న్ వార్డుగా తిరుచానూరులోని ప‌ద్మావ‌తి నిల‌యం

రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ్ఞ‌ప్తి మేర‌కు తిరుచానూరులోని ప‌ద్మావ‌తి నిల‌యం భ‌వ‌నాన్ని క‌రోనా ఐసోలేష‌న్ వార్డుగా వినియోగించుకునేందుకు అనుమ‌తి ఇచ్చామ‌ని ఈవో తెలిపారు. ఇంకా అవ‌స‌ర‌మైతే తిరుప‌తిలోని రైల్వేస్టేష‌న్ వ‌ద్ద గ‌ల స‌త్రాల‌ను కూడా ఐసోలేష‌న్ వార్డులుగా ఉప‌యోగించుకుంటామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కోరార‌ని, ఇందుకు అంగీక‌రించామ‌ని వివ‌రించారు.

విస్తృతం ప్ర‌చారం

క‌రోనా వ్యాప్తిపై విస్తృత ప్ర‌చారం చేస్తున్నామ‌ని, ఇందుకోసం భ‌క్తుల‌కు రోజుకు ల‌క్ష క‌ర‌ప‌త్రాల‌ను పంపిణీ చేస్తున్నామ‌ని, తిరుమ‌ల‌లో నిరంత‌రం ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నామ‌ని ఈవో వివ‌రించారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా లేద‌ని, టైంస్లాట్ టోకెన్లు పొందిన‌ట్ల‌యితే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఎక్కువ సేపు వేచి ఉండ‌కుండా స్వామివారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని, ఇలా చేస్తే అంద‌రికీ సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని తెలియ‌జేశారు. క్యూకాంప్లెక్స్‌లోని ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో సాధార‌ణంగా 500 మంది భ‌క్తులు కూర్చుంటార‌ని, క‌రోనా వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా 250 మందిని మాత్ర‌మే ఒక్కో కంపార్ట్‌మెంట్‌లోకి అనుమ‌తిస్తున్నామ‌ని తెలిపారు. భ‌క్తులు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించాల‌ని, నివార‌ణ చ‌ర్య‌ల‌పై ఎస్వీబీసీతో పాటు ఇత‌ర అన్ని మార్గాల ద్వారా ప్ర‌చారం చేస్తున్నామ‌ని చెప్పారు. ఆరోగ్య విభాగం ఆధ్వ‌ర్యంలో పారిశుద్ధ్య సామ‌గ్రి సిద్ధంగా ఉంచుకున్నామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్ఆర్‌.రెడ్డి, ముఖ్య వైద్యాధికారి డా. నాగేశ్వ‌ర‌రావు, కేంద్రీయ వైద్య‌శాల సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ కుసుమ‌కుమారి, యూనిట్ అధికారి శ్రీ శ్రీ‌నివాస‌మూర్తి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.