ELABORATE ARRANGEMENTS FOR RATHASAPTAMI IN TIRUMALA _ తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు
తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు
తిరుమల, 2025 ఫిబ్రవరి 02 ; తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 04వ తేది మంగళవారం నాడు రథసప్తమి పర్వదినానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో సప్తమినాడు శ్రీ మలయప్పస్వామివారు 7 ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
వాహనసేవలు తిలకించేందుకు వచ్చే భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు గ్యాలరీల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఇక్కడ భక్తులకు టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి అందిస్తారు. వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ మాడ వీధులను రంగవళ్లులతో అందంగా తీర్చిదిద్దారు. ఎండలో నడిచేందుకు ఇబ్బంది పడకుండా వైట్ పెయింట్ వేశారు.
భక్తులకు భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు, ఎస్‌పిఎఫ్ సిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు సేవలందిస్తారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులకు విధులు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.