ELECTRICAL ILLUMINATION LIGHTS UP VENKATAPALEM _ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న అమరావతిలోని శ్రీవారి కల్యాణ వేదిక
AMARAVATHI/TIRUMALA: The skies at Venkatapalem sparkled with the electrical illumination set up by TTD in connection with the grand celebration of the Srinivasa Kalyanam on Saturday.
The spectacular arrangements made by TTD included the splendid illumination works with images of various deities decorated in the colourful LED lights which has given the entire place a Heavenly look and feel to the devotees who thronged the premises to witness the celestial wedding ceremony.
On total 17 cutouts including Dasavatarams, Alankara Priya(Lord in Jewels), Maha Vishnu, Lakshmi Venkateswara, Srivari Padalu(holy feet of Lord), Padmavathi Venkateswara, Gopalakrishna, Adisesha, Ananda Nilayam and many more erected in electrical lights stood as a cynosure.
Around 5000 flood lights, 25 generators have been used to make these arrangements. Besides 18 Giant LED screens have also been erected for the benefit of the devotees to witness the Srinivasa Kalayanam.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న అమరావతిలోని శ్రీవారి కల్యాణ వేదిక
అమరావతి / తిరుమల 2025 మార్చి 15: అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన శ్రీనివాస కల్యాణం సందర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. ఆలయం చుట్టూ ఏర్పాటుచేసిన దేవతామూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
శ్రీవారి ఆలయ ప్రాంగణం చుట్టూ మొత్తం 17 విద్యుత్ దీపాల కటౌట్లు ఏర్పాటుచేశారు. వీటిలో దశావతారమూర్తి, ఆభరణాల వేంకటేశ్వరుడు, మహావిష్ణువు, లక్ష్మీ వేంకటేశ్వరస్వామి, స్వామివారి పాదాలు, శంఖుచక్ర నామాలు, పద్మావతి వేంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, గోపాలకృష్ణుడు, ఆదిశేషుడు, పద్మావతి ఆనందనిలయం ఉన్నాయి. ప్రవేశద్వారాల వద్ద స్వాగత ఆర్చీలు, రోడ్డుకు ఇరువైపులా 60 ఎల్‌ఈడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. నమూనా ఆలయ గోపురం, ఆనందనిలయం, ప్రాకార మండపాన్ని 5 వేల ఫ్లడ్ లైట్లు, ఎల్‌ఈడి లైట్లతో అద్భుతంగా అలంకరించారు. ఇందుకోసం 25 జనరేటర్స్ ఏర్పాటు చేశారు.
ఎస్వీబీసీ ప్రసారాలు, ఆలయంలో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను భక్తులు తిలకించేందుకు వీలుగా 18 పెద్ద ఎల్‌ఇడి తెరలను ఏర్పాటు చేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.