GAJA VAHANA SEVA HELD _ గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి అభయహస్తం

TIRUPATI, 12 JUNE 2025: Sri Prasanna Venkateswara Swamy of Appalayagunta blessed His devotees on the mighty Gaja Vahanam on Thursday evening.

Temple DyEO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Smt Srivani, Temple Inspector Sri Siva Kumar, Archakas, devotees, sevaks and others were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి అభయహస్తం

తిరుపతి/ అప్పలాయగుంట, 2025, జూన్ 12: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 07.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.

రాత్రి 07.00 గంటలకు గజ వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 – 4.00 గం.ల మధ్య పుణ్యహం, వసంతోత్సవం నిర్వహించారు.

శుక్రవారం ఉదయం 08.00 గం.లకు సూర్యప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు.

వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.