RUDRA HOMAM COMMENCES _ శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర ‌హోమం ప్రారంభం

Tirupati, 08 November 2025: The Eleven day Rudra Homam commenced in Sri Kapileswara Swamy temple at Tirupati on Saturday.

This ritual will be observed till November 18 as a part Homa Mahotsavams.

Special religious rituals like Rudra Japam, Rudra Trisati, Bilwarchana, Visesha Deeparadhana are performed.

Temple DyEO Smt Nagaratna, Superintendent Sri Chandrasekhar, other staff, devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర‌ హోమం ప్రారంభం

తిరుపతి, 2025 న‌వంబరు 08: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌హోమం) శ‌నివారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా న‌వంబరు 8 నుండి 18వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ‌, రుద్ర‌జ‌పం, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, నివేద‌న, హార‌తి నిర్వహించారు. సాయంత్రం పూజ‌, జ‌పం, హోమం, రుద్ర‌త్రిశ‌తి, బిల్వార్చ‌న‌, నివేద‌న‌, విశేష‌దీపారాధ‌న, హార‌తి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, సూప‌రింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.