ELEVEN DAY RUDRA YAGAM CONCLUDES _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన రుద్ర‌యాగం

Tirupati, 18 November 2025: The Eleven day Rudra Yagam concluded on a grand religious note in Sri Kapileswara Swamy temple in Tirupati on Tuesday.

This homam began on November 08 as a part of Homa Mahotsavams.

Meanwhile on Tuesday evening, the celestial Siva Parvati Kalyanam was also observed in a grand manner.

On November 19, Dharma shastra Homam and November 20 Sri Chandikeswara Homam will be observed.

All the temple officials, devotees participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన రుద్ర‌హోమం

అత్యంత వైభవంగా శ్రీ శివపార్వతుల కళ్యాణం

నవంబర్ 19 ధర్మ శాస్త్ర హోమం, 20 త్రిశూల స్నానం

తిరుపతి, 2025 న‌వంబరు 18: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌హోమం) మంగళవారం శాస్త్రోక్తంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా న‌వంబరు 8 నుండి 18వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హించారు.

అత్యంత వైభవంగా శ్రీ శివపార్వతుల కళ్యాణం

హోమ మహాత్సవాల్లో భాగంగా నవంబర్ 18 మంగళవారం సాయంత్రం శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. లోకకల్యాణం కోసం నిర్వహించిన శ్రీ శివ పార్వతుల కల్యాణోత్సవానికి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

నవంబర్ 19న ధర్మ శాస్త్ర హోమం, నవంబర్ 20వ తేదీన శ్రీ చండికేశ్వరస్వామి హోమం, త్రిశూల స్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం జరుగనుంది.

పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి క్షేత్రంలోని హోమాల్లో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, సూప‌రింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.