ELEVEN DAY RUDRA YAGAM CONCLUDES _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన రుద్ర‌యాగం

TIRUPATI, 29 NOVEMBER 2024: The eleven-day Rudra Yagam concluded on a grand religious note in Sri Kapileswara Swamy temple in Tirupati on Friday.

As part of the evening Rudra Yagam Samapti, Maha Purnahuti, Maha Shanti Abhishekam, Kalasa Udwasana, Kalashabisekam to Moolavarlu were performed.

In the evening Siva Parvathi Kalyanam was held.

JEO for Health and Education Smt Goutami, DyEO Sri Devendra Babu, Temple officials, Grihasta devotees were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన రుద్ర‌యాగం

తిరుప‌తి‌, 2024 నవంబరు 29: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 11 రోజుల పాటు జరిగిన శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) శుక్రవారం శాస్త్రోక్తంగా ముగిసింది. ఆలయంలో హోమ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఉదయం రుద్రయాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉద్వాసన‌, శ్రీ కపిలేశ్వరస్వామి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.

సాయంత్రం శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.

త‌రువాత రాత్రి శ్రీ కాలభైరవ స్వామివారి క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ ఆరాధ‌న‌ నిర్వహించారు. నవంబరు 30న శ్రీ కాలభైరవస్వామివారి హోమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ జెఈవో శ్రీమతి గౌతమి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.