ENHANCE GREENERY AT ALL VIEW POINTS IN TIRUMALA- TTD EO _ తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాల్లో ఈవో త‌నిఖీలు

INSPECTS VARIOUS PLACES IN HILL TOWN

 TIRUMALA, 23 JULY 2021: The landscapes and greenery should be developed at all the viewpoints, visibility areas and important places in Tirumala to enhance the aesthetic look of the Hill Town, said TTD EO Dr KS Jawahar Reddy.

During his inspection in Tirumala on Friday, the EO along with Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti, visited Sainik Niwas at GNC, ANC, Narayanagiri Gardens, Boondi Potu, New Parakamani Building and Goshala, he suggested the officials concerned over improvements to be made in the respective areas.

 

Later speaking to media persons he said, there is a lot of scope for developing greenery at all the viewpoints near GNC, ANC, Narayanagiri Gardens, Srivari Mettu Valley Points. “The officials concerned were directed to clear the debris located in the areas of Narayanagiri Gardens, South Mada Street and take up the beautification by enhancing greenery. Similarly, Gardens shall be developed in the valley point at Srivari Mettu footpath. It was also instructed to make use of the rain water for growing plants near the ANC area. Landscapes shall be developed at all the visibility areas in Tirumala”, he added.

Earlier, the EO also visited the modernized Boondi Potu Complex and inspected the preparation of Boondi from BG dal. He also observed the functioning of Thermo Fluid Stoves. Later he paid a visit to the new Parakamani Building which is under construction opposite MTVAC. The field inspection by EO concluded at Goshala.

TTD CE Sri Nageswara Rao, SV Goshala Director Dr Harnath Reddy, DFO Sri Chandrasekhar, Garden Deputy Director Sri Srinivasulu, DyEOs Sri Lokanatham, Sri Bhaskar, Additional Health Officer Dr Sunil Kumar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాల్లో ఈవో త‌నిఖీలు

తిరుమల, 2021 జులై 23: టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శుక్ర‌వారం తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. గ‌తంలో త‌నిఖీల సంద‌ర్భంగా సూచించిన ప‌లు ప‌నుల ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు.

అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో ఖాళీగా ఉన్న ప్ర‌దేశాల్లో ప‌చ్చ‌ద‌నం పెంచి భ‌క్తుల‌కు ఆహ్లాద‌క‌రంగా ఉండేలా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ద‌క్షిణ మాడ వీధిలో ప‌చ్చ‌ద‌నం పెంచేలా, అవ‌స‌ర‌మైన ఇత‌ర ప్రాంతాలు, కాటేజీల మ‌ధ్య‌భాగంలో ఉద్యాన‌వ‌నాలు పెంచేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు. భ‌క్తులు న‌డిచే ఫుట్‌పాత్‌ల‌లో విరిగిన టైల్స్ స్థానంలో కొత్త‌వి ఏర్పాటు, భ‌క్తులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటుకు ఆదేశించామ‌న్నారు. శ్రీ‌వారికి అవ‌స‌ర‌మ‌య్యే పుష్పాలను తిరుమ‌ల‌లోనే పండించేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని, ఇందుకోసం ప‌లువురు దాత‌లు కూడా ముందుకొస్తున్నార‌ని చెప్పారు. శ్రీ‌వారికి నైవేద్యానికి, దీపారాధ‌న కోసం దేశీయ ఆవునెయ్యిని ఇక్క‌డే త‌యారుచేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. టిటిడి ఆల‌యాల్లో వినియోగించిన పుష్పాల‌ను మ‌రుస‌టి సేక‌రించి తిరుప‌తిలోని గోశాల‌లో అగ‌ర‌బ‌త్తీలు త‌యారుచేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, ఆగ‌స్టు 15 నాటికి కొన్ని ఉత్ప‌త్తుల‌ను విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. ఈ అగ‌ర‌బ‌త్తీలను తిరుమ‌ల‌లో కౌంట‌ర్లు ఏర్పాటుచేసి భ‌క్తుల‌కు విక్ర‌యిస్తామ‌ని, ఇందులో వ‌చ్చే లాభాన్ని గోసంర‌క్ష‌ణ‌కు వినియోగిస్తామ‌ని వివ‌రించారు.

అంత‌కుముందు బూందీ పోటులో శ‌న‌గ‌పిండి మిక్సింగ్‌, బూందీ త‌యారీ, థ‌ర్మోఫ్లూయిడ్ స్టౌలను ఈవో ప‌రిశీలించారు. అదేవిధంగా జిఎన్‌సి టోల్‌గేట్‌, సైనిక్ నివాస్, ల‌డ్డూ కౌంట‌ర్లు, గోశాల, నిర్మాణంలో ఉన్న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని ప‌రిశీలించారు. నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో వ్య‌ర్థాల‌ను తొల‌గించాల‌ని అధికారుల‌కు సూచించారు. శ్రీ‌వారిమెట్టు మార్గంలో ప‌ల్ల‌పు ప్రాంతాల్లో ఉద్యాన‌వ‌నాలు పెంచాల‌న్నారు. ఏఎన్‌సి ప్రాంతంలో వ‌ర్ష‌పునీరు నేరుగా ఉద్యాన‌వ‌నాల్లోని చెట్ల‌కు చేరేలా ఏర్పాటు చేయాల‌న్నారు.

ఈవో వెంట టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, రిసెప్ష‌న్‌ డెప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్‌, ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌ త‌దిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.