EO AND ADDL EO INSPECTS MADA STREETS _ గ్యాలరీలలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈఓ, అద‌న‌పు ఈవో

Tirumala, 08 October 2024: The TTD EO Sri J Syamala Rao along with Additional EO Sri Ch Venkaiah Chowdhary made inspections along four Mada streets to check the facilities being provided to devotees in Galleries.

TTD has made elaborate arrangements such as supply of Annaprasadams and other and beverages to devotees waiting in galleries since last night to witness the grand Garuda Vahana.

They went round the Mada streets to interact with devotees on availability of Anna Prasadam, drinking water, toilet facilities and others.

They instructed the. Sectoral officers to ensure speedy supply to the last devotee by taking the services of Srivari Sevaks.

They urged the officials to keep up the good work and ensure the grand success of Garuda Vahana Seva.

Meanwhile TTD has deputed 560 odd employees for ensuring smooth movement of Garuda Seva.

Of them 46 are senior officers and 360 are ministerial staff.

JEO Sri Veerabrahmam, CVSO Sri Sridhar, Additional FACAO Sri Balaji supervised the arrangements to devotees from time to time in the galleries.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గ్యాలరీలలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈఓ, అద‌న‌పు ఈవో

– ఉద‌యం 5 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు

– ఉద‌య‌మే నిండిన గ్యాలరీలు

– దాదాపు 1500 మంది శ్రీవారి సేవకుల సేవ‌లు

– సీనియర్ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌

తిరుమల, 2024 అక్టోబ‌రు 08: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగ‌ళ‌వారం రాత్రి జ‌రుగ‌నున్న గరుడ వాహన సేవను ద‌ర్శించేందుకు తెల్లవారుజాము నుంచే భ‌క్తులు గ్యాలరీల్లో వేచి ఉన్నారు. ఉద‌యానిక‌ల్లా గ్యాల‌రీలు భ‌క్తుల‌తో నిండాయి. ఉదయం 5 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. తూర్పు-పశ్చిమ-ఉత్తరం-దక్షిణ మాడవీధుల్లో గ‌ల 200కు పైగా గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చున్నారు.

భ‌క్తుల కోసం ఉదయం 5 నుండి 6 గంటల మధ్య పాలు, కాఫీ, ఉదయం 6.30 నుండి 8 గంటల మధ్య ఉప్మా, పొంగ‌ళి పంపిణీ చేశారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉదయం 10 గంటలకు సాంబార్ అన్నం, టమాటా అన్నం, స్వీట్ పొంగల్ అందించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు భక్తులకు రెండు లక్షలకు పైగా పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. సాయంత్రం సుండ‌ల్‌, కాఫీ, పాలు మళ్లీ పంపిణీ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు గరుడవాహనం ప్రారంభం కానుండ‌గా ఉత్తర, తూర్పు మాడ వీధుల్లో సాయంత్రం 6 గంటల వరకు వెజిటబుల్ కిచిడీ పంపిణీ చేశారు.

టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి గ్యాలరీలను పరిశీలించి భ‌క్తులకు అందజేస్తున్న అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌రుగుదొడ్లు ఇతర సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వాహన సేవ పూర్తయ్యే వరకు డిప్యూటేషన్ సిబ్బంది వారికి కేటాయించిన స్థానాల్లో విధులు నిర్వహించాలన్నారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ, గరుడ సేవను చూడటానికి తిరుమల నాలుగుమాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను మంగ‌ళ‌వారం సాయంత్రం పరిశీలించినట్టు తెలిపారు. గ్యాలరీలలో వేచి ఉండే ప్రతి భక్తుడికీ గరుడ వాహనంపై ఉన్న శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం చేయించిన తరువాతే స్వామివారు ఆలయానికి వేంచేస్తారని తెలిపారు. ఇప్పటికే గ్యాలరీల్లో లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. తాను చాలామందితో మాట్లాడానని, అందరూ టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు.

శ్రీ‌వారి సేవకులకు ప్ర‌శంస‌లు

నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు తెల్లవారుజాము నుంచి అంకితభావంతో, భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల నిస్వార్థ‌సేవలను టీటీడీ ఈవో కొనియాడారు. దాదాపు 1500 మంది శ్రీవారి సేవకులు ఆహారపొట్లాల‌ ప్యాకింగ్, గ్యాలరీలలో అన్న‌ప్ర‌సాదాల విత‌ర‌ణ‌, ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో తాగునీటి పంపిణీ త‌దిత‌ర సేవలందించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.