EO HOLDS MEETING WITH RICE MILLERS _ అన్నప్రసాదాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి _ రైస్ మిల్లర్లతో టీటీడీ ఈవో సమావేశం
TIRUMALA, 24 JULY 2024: As a part of enhancing the taste of Annaprasadams, TTD EO Sri J Syamala Rao held a meeting with Rice Millers who are supplying the rice to TTD.
The meeting was held in the Conference Hall of the Administrative Building in Tirupati on Wednesday.
The representatives of the Rice Millers’ Association from AP and TS participated.
The EO asked the Rice Millers Association leads from both the states to give specifications that help in enhancing standards of rice during procurement so that the same might be included while inviting for tenders.
While suggesting many parameters that enhance the taste of rice, they also brought to the notice of EO that the cooking equipment in Vengamamba Annaprasadam needs an overhaul as they are over a decade and a half old.
The EO said TTD has already contemplated the same and will soon bring changes in the cooking method.
Both the JEOs Smt Goutami, Sri Veerabrahmam, DyEO Annaprasadam Sri Rajendra Kumar, EE Procurement Sri Murali Krishna, Special Catering Officer Sri Sastry, representatives from AP and Telengana Rice Millers’ Association were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్నప్రసాదాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి
– రైస్ మిల్లర్లతో టీటీడీ ఈవో సమావేశం
తిరుమల, 2024 జూలై 24 ; తిరుమలకు విచ్చేసే వేలాదిమంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు రైస్ మిల్లర్లను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీకి బియ్యం సరఫరా చేస్తున్న రైస్‌మిల్లర్లతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బియ్యం సేకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించడంలో దోహదపడే అంశాలను ఇవ్వాలని కోరారు. తద్వారా టెండర్లకు ఆహ్వానించే సమయంలో వాటిని చేర్చవచ్చు అన్నారు.
అన్నం రుచిని పెంపొందించేందుకు రైస్ మిల్లర్స్ పలు సూచనలు చేశారు. ఇందులో ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో వంట పరికరాలు దశాబ్దంన్నర కాలం నాటివి కావడంతో వాటి స్థానంలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ఈవో దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు ఈవో స్పందిస్తూ ఇప్పటికే టీటీడీ ఈ విషయమై ఆలోచన చేసిందని, త్వరలో వంటశాలలను ఆధునీకరించనున్నట్లు ఈవో తెలిపారు.
ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రకుమార్, ప్రత్యేక అధికారి (కేటరింగ్) శ్రీ శాస్త్రి,ఈఈ ప్రొక్యూర్‌మెంట్ శ్రీ మురళీకృష్ణ, ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.