EO INSPECTS AGARBATTI UNIT AT TIRUPATI GOSHALA _ ఎస్వీ గోశాలలో అగర బత్తుల తయారీని పరిశీలించిన టిటిడి ఈవో
Tirupati, 30 August 2021: TTD Executive Officer Dr KS Jawahar Reddy on Monday inspected the Agarbatti making unit at the Goshala after participating in the Gokulastami celebrations and gave valuable suggestions to the officials.
Speaking on the occasion the TTD EO said within a week or ten days the TTD agarbattis made out of used flower garlands in TTD temples shall be made available for sales to devotees.
He said initially ten brands of incense sticks in attractive design packages shall be available.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ గోశాలలో అగర బత్తుల తయారీని పరిశీలించిన టిటిడి ఈవో
తిరుపతి, 2021 ఆగస్టు 30: తిరుపతి ఎస్వీ గోశాలలో సోమవారం ఉదయం గోకులాష్టమి గోపూజ అనంతరం ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అగర బత్తుల తయారీ ప్లాంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పూలతో తయారు చేసే పరిమళమైన అగర బత్తులు వారం, పది రోజుల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అగర బత్తులను ఆకర్షణీయమైన డిజైన్లతో, పది రకాల బ్రాండ్లతో తయారు చేసి అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.