EO INSPECTS ALIPIRI CHECK POST AND SRIVARI METTU DD TOKENS CENTRE _ భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని అలిపిరికి మార్చాం – టిటిడి ఈవో

TIRUPATI, 07 JUNE 2025: TTD EO Sri J Syamala Rao along with Additional EO Sri Ch Venkaiah Chowdary and other top brass officials inspected the Alipiri Toll Plaza on Saturday evening.

As a part of it he inspected the process of frisking and luggage scanning in Alipiri checkpoint.

Later he directed the officers concerned to examine the Air Port checking system and introducing state of art technology at the point.

Later he also visited Srivari Mettu Divya Darshan token issuing counters at Bhudevi Complex.

The EO said the counters have been shifted from Srivari Mettu to Alipiri keeping in view the larger interests of the devotees.

JEO Sri Veerabrahmam, CV&SO Sri Munikrishna, Tirupati SP Sri Harshavardhan Raju and other officers were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని అలిపిరికి మార్చాం – టిటిడి ఈవో

తిరుపతి, 2025, జూన్ 07: శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే దివ్యదర్శనం భక్తులకు టోకెన్లను అక్కడే జారీ చేయడం వల్ల భక్తులు అసౌకర్యానికి గురౌతున్నారనే ఫిర్యాదులు రావడంతో భూదేవి కాంప్లెక్స్ కు తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం నుండి మార్చామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో రోజుకు సరాసరి 5,000 టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. అలిపిరిలో పటిష్టంగా టోకెన్ల జారీ యంత్రాంగం, భక్తులకు సౌకర్యవంతంగా రవాణా సౌకర్యం, భద్రతా ఉందని ఈవో తెలిపారు. శ్రీనివాస మంగాపురంలో టోకెన్లు జారీ చేసేందుకు ఆర్కియాలజీ శాఖ అనుమతులు రాగానే అక్కడ టోకెన్లు జారీ చేస్తామన్నారు. కాలినడకన శ్రీవారి మెట్టుకు వెళ్లేందుకు భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లు పొందేందుకు వచ్చిన భక్తులతో టిటిడి ఈవో మాట్లాడారు. దివ్యదర్శనం భక్తులకు టోకెన్లు జారిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడుగగా, భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో సమీక్ష అనంతరం టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు ఉన్నతాధికారులతో కలసి అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను పరిశీలించారు. లగేజీ స్కానింగ్ కేంద్రంలోని అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్లు జారీని పరిశీలించి, భక్తులతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఅండ్ ఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్థన్ రాజు, సిఈ శ్రీ టివి సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.