EO INSPECTS ARRANGEMENTS AT VONTIMITTA _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో
Vontimitta, 11 Mar. 20: TTD EO Sri Anil Kumar Singhal along with JEO Sri P Basant Kumar and CVSO Sri Gopinath Jatti has inspected the ongoing arrangements for mega annual religious event of Brahmotsavams at Vontimitta temple in YSR Kadapa district on Wednesday.
Later speaking to media persons he said, every year TTD makes grand arrangements for the annual fete especially for Sri Sita Rama Kalyanam, which takes, place on April 7.
He said, as a part of it, a preliminary inspection has been carried out today. “The Honourable CM of AP Sri YS Jaganmohan Reddy has already given his consent to take part in the celestial marriage. Every year we are bettering our development activities in this historical place. This year we have constructed permanent sheds”, the EO added.
He also said, all the sanctioned works for the development of the temple has also been inspected. The Talambralu packets, srivari sevakulu and security measures will also be assessed soon by the concerned departments”, he added.
The EO also said, the publicity activity will be taken from March 11 onwards as there are more than three weeks left for the annual Brahmotsavams to commence from April 2 onwards with Dhwajarohanam. In between a couple of inspections will be carried out and also with the local authorities “, he maintained.
Earlier, the EO inspected the ongoing works in temple, at Kalyana Vedika and New PAC and given necessary instructions to the officials concerned. CE Sri Ramachandra Reddy, SEs Sri Ramesh Reddy, Sri Venkateswarulu, EE Sri Jaganmohan Reddy, DFO Sri Phani Kumar Naidu, Temple DyEO Sri Lokanatham and other officials participated.
While District Collector Sri Hari Kiran, Joint Collector Smt Goutami, Additional SP Sri Vrishikeshav Reddy and other officers also participated in the inspection.
POSTERS RELEASED
Meanwhile, TTD EO along with JEO released the annual brahmotsavams posters at Vontimitta temple premises on Wednesday.
The important days included Dhwajarohanam on April 2, Garuda Seva on April 6, Sita Rama Kalyanam on April 7, Rathotsavam on April 8, Chakrasnanam on April 10 and Pushpayagam on April 11.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో
ఒంటిమిట్ట, 2020 మార్చి 11: టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ శ్రీ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి గౌతమి, టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను ఈ రోజు పరిశీలించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాములవారి కల్యాణానికి విచ్చేయనున్నారని తెలిపారు. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం పలు రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఈ ఏడాది శాశ్వత షెడ్లు నిర్మించామని వెల్లడించారు.
ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా పరిశీలించినట్టు ఈవో తెలిపారు. తలంబ్రాల ప్యాకెట్ల తయారీ, శ్రీవారి సేవకుల సేవలు, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 2న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, మార్చి 11 నుండి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. బ్రహ్మోత్సవాల లోపు స్థానిక అధికారులు, టిటిడి అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తామన్నారు.
అంతకుముందు కల్యాణవేదిక, యాత్రికుల వసతి సముదాయం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు.
బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు.
ఇందులో ప్రధానంగా ఏప్రిల్ 2న ధ్వజారోహణం, ఏప్రిల్ 6న గరుడసేవ, ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 8న రథోత్సవం, ఏప్రిల్ 10న చక్రస్నానం, ఏప్రిల్ 11న పుష్పయాగం జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పి శ్రీ రిషికేశవరెడ్డి, టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ (ఎలక్ట్రికల్) శ్రీ వేంకటేశ్వర్లు, ఇఇ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌నాయుడు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.