EO INSPECTS CM VISIT ARRANGEMENTS _ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో
తిరుమల, 2025 మార్చి 20: ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి గురువారం పరిశీలించారు.
ముందుగా పద్మావతి అతిథి గృహం వద్ద ముఖ్యమంత్రివర్యులకు చేసిన వసతి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్స్-1, శ్రీవారి ఆలయంలో చేసిన దర్శన ఏర్పాట్లను తనిఖీ చేశారు. తదనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ముఖ్యమంత్రి మరియు వారి కుటుంబ సభ్యులు చేసే అన్న ప్రసాద సేవకు సంబంధించి చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర, శ్రీ భాస్కర్, వీజీవో శ్రీ సురేంద్ర, డీఈ శ్రీ చంద్ర శేఖర్, ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.