EO INSPECTS COMPARTMENTS-INTERACTS WITH PILGRIMS _ భక్తులకు అందుతున్న సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్న టీటీడీ ఈవో
VERIFIES THE AMENITIES IN VQC
TIRUMALA, 26 JULY 2024: TTD EO Sri J Syamala Rao inspected the Vaikuntham Queue Complex 1 and 2, to verify the various amenities being provided to the waiting pilgrims in the compartments by TTD till their turn for darshan on Friday evening.
As a part of it, the EO visited different compartments and personally interacted with the devotees about the various facilities. He also inspected the Vaikuntham Dispensary and checked the available medicines. The EO also observed the Srivari Sevaks offering milk to the waiting pilgrims in the compartments.
In his inspection, the EO checked the toilets, the presence of attenders to open the compartment gates, function of fans, lights, telephones, SVBC programmes being telecasted on the LED screens and the display of pilgrim information about the release timings of compartments and made a few suggestions to the officials concerned.
Along with the EO, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, DE Electrical Sri Ravishankar Reddy, DyEO Temple Sri Lokanatham and other officials were present. Food Safety Department authorities will train the TTD Annaprasadam staff, hoteliers and other vendors on Food Safety measures soon, said TTD EO Sri J Syamala Rao.
For the convenience of SRIVANI donors he examined a SRIVANI Trust darshan ticket issuing counter should be set up temporarily at the Adiseshu rest house next to the donor cell and later set up a permanent structure behind the Gokulam rest house.
Later the EO also inspected temple premises, Tirumala Nambi temple, bio-metric point with the officials.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తులకు అందుతున్న సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్న టీటీడీ ఈవో
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తనిఖీ
• శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన
తిరుమల, 2024, జూలై 26: వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఈవో శ్రీ జె. శ్యామలరావు శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, తాగునీరు, శ్రీవారి సేవకులతో పాలు పంపిణీ తదితర విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
భక్తులను దర్శనానికి అనుమతించేటప్పుడు గేట్లు తెరవడం, కంపార్ట్మెంట్లలో పారిశుద్ధ్య చర్యలు, పెద్ద స్క్రీన్ లలో ప్రసారం అవుతున్న ఎస్వీబీసీ కార్యక్రమాలు, వివిధ భాషలలో భక్తులకు అందిస్తున్న సమాచారం తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
అంతకుముందు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టికెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలన్నారు. ఇందుకోసం గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దాతల విభాగం ప్రక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ కౌంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ప్రస్తుతం ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో పూర్తిస్థాయిలో శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో టికెట్లు జారీ చేయు కౌంటర్లు, 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తరువాత ఈవో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను, తిరుమలనంబి ఆలయం, బయోమెట్రిక్ ను పరిశీలించారు.
ఈవో వెంట జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఎలక్ట్రికల్ డిఈ శ్రీరవిశంకర్ రెడ్డి, విజిఓ శ్రీ నందకిషోర్, ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.