EO INSPECTS CRO, NG SHEDS, OUTSIDE QUEUE LINES _ తిరుమలలో ఈవో విస్తృత తనిఖీలు
TIRUMALA, 17 SEPTEMBER 2024: TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdhary on Tuesday inspected CRO General and Narayanagiri Sheds, outside lines in Tirumala.
Later speaking to media persons, he said as the devotee rush to Tirumala has increased due to consecutive holidays for the last three days and with the advent of Puratasi month, it is taking nearly 20-24 hours for the SSD tokenless or ticketless pilgrims to have the darshan of Sri Venkateswara Swamy.
The devotees have to wait with patience till their turn for darshan.
The TTD management has made elaborate arrangements and is continuously providing Annaprasadam, drinking water, milk, tea, coffee to the devotees in Vaikuntam compartments, Narayangiri sheds and those waiting in outside queues also.
TTD has also appointed senior officials for continuous monitoring of these arrangements in the larger interests of the devotees.
The devotees are therefore requested to observe these facilities and cooperate with TTD Management.
Earlier, the EO also inspected the distribution of Annaprasadam and water at NG Sheds, outside lines and in CRO he instructed the officials concerned to come out with an action plan to set up a waiting hall behind CRO for the pilgrims. Thereafter, he also visited the Pilgrim Information Counter located at CRO and made some suggestions to the counter staff on how to inform the pilgrims in a better way on the accommodation and other amenities.
CE Sri Satyanarayana, DyEOs Sri Bhaskar, Sri Harindranath, CPRO Dr T Ravi, VSO Sri Surendranath, Special Catering Officer Sri Shastry and other officials were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో ఈవో విస్తృత తనిఖీలు
తిరుమల, 2024 సెప్టెంబరు 17: టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం తిరుమలలోని సిఆర్‌ఓ జనరల్ మరియు నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్‌లను తనిఖీ చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత మూడు రోజులుగా వరుస సెలవులు, పురటాసి మాసం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 20 నుండి 24 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతోందన్నారు. కావున దర్శనం కోసం భక్తులు తమ వంతు వచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలన్నారు.
వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు, టీ, కాఫీలను టీటీడీ యాజమాన్యం నిరంతరాయంగా అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను కూడా టీటీడీ నియమించిందన్నారు.
అంతకుముందు నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్ల వద్ద అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీని పరిశీలించారు. సి ఆర్ వో వెనుక భాగాన యాత్రికులు వేచి ఉండేలా ఒక వెయిటింగ్ హాల్ ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత, ఆయన సిఆర్ఓ వద్ద ఉన్న యాత్రికుల సమాచార కౌంటర్‌ను పరిశీలించారు. యాత్రికులకు వసతి మరియు ఇతర సౌకర్యాలపై మెరుగైన సమాచారం ఎలా తెలియజేయాలనే దానిపై సంబంధిత సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీవోలు శ్రీ భాస్కర్, శ్రీ హరేంద్రనాథ్, వి ఎస్ ఓ శ్రీ సురేంద్ర, సిపిఆర్వో డాక్టర్ టి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.