EO INSPECTS DEVELOPMENT WORKS _ తిరుమలలో పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసిన ఈవో
Tirumala, 16 Dec. 20: TTD EO Dr KS Jawahar Reddy along with Additional EO Sri AV Dharma Reddy inspected various works which are under progress in Tirumala on Wednesday and directed the concerned to complete the works which are under finishing stage before Vaikuntha Ekadasi.
As part of his inspection spree, EO visited the cottages which are under renovation in SMC and Narayanagiri areas. He instructed the CE Sri M Ramesh Reddy to ensure that the works get completed and brought into utility for pilgrims before Vaikuntha Ekadasi. The EO also inspected the ongoing works at Gokulam, TBC, ATC circles and directed the Garden wing chief Sri Srinivasulu to grow floral plants on a grand scale to enhance the beauty of dividers and lawns present in Tirumala. Later he instructed the concerned to remove the debris located at Bata Gangamma temple and clean up and beautify the tank located behind Srivari Seva Sadan. HE also visited the cold storage in the Garden wing and floral tying area, different types of flowers grown in the Garden department.
The EO also visited the Sri Gandham Vanam coming up in the 10acreas area in Tirumala exclusively to grow sandalwood plantation for the temple needs.
SE 2 Sri Nageswara Rao, DFO Sri Chandrasekhar, VGO Sri Bali Reddy were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసిన ఈవో
తిరుమల, 2020 డిసెంబరు 16: తిరుమలలో వివిధ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను బుధవారం టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శంకుమిట్ట, నారాయణగిరి కాటేజీల్లో మరమ్మతులు తుది దశకు చేరుకున్నాయని, వైకుంఠ ఏకాదశి నాటికల్లా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. భక్తులకు కనువిందుగా ఉండేలా కూడళ్లలోని డివైడర్లలో పూల మొక్కల పెంచాలని ఉద్యానవన విభాగం అధికారులకు సూచించామన్నారు. శ్రీవారి ఆలయ అవసరాల కోసం అటవీ విభాగం ఆధ్వర్యంలో 10 ఎకరాల్లో శ్రీగంధం వనం పెంచుతున్నట్టు చెప్పారు.
అంతకుముందు ఎస్ఎంసి సర్కిల్ నుండి ఈవో తనిఖీలు ప్రారంభించారు. గోకులం, నారాయణగిరి, టిబిసి, సర్కిళ్లను పరిశీలించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో పూలమొక్కలు ఎక్కువగా పెంచాలన్నారు. ఎస్వీజీహెచ్ వెనుకగల సబ్ స్టేషన్‌ను పరిశీలించి అక్కడి ముళ్లపొదలు తొలగించాలని సూచించారు. బాటగంగమ్మ గుడి మార్గంలో ఉపయోగంలో లేని సామగ్రిని తొలగించాలని, సేవా సదన్ వెనుక గల నీటి కుంటను సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఉద్యానవన విభాగంలో పూలు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజి, పూలమాలల తయారీ, పలు రకాల పూల మొక్కల పెంపకాన్ని ఈవో పరిశీలించారు.
ఈవో వెంట టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, డిఎఫ్‌వో శ్రీ చంద్రశేఖర్, ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.