EO INSPECTS ONGOING WORKS _ తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు
తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు
తిరుమల, 2024 అక్టోబరు 25: టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వకుళామాత కేంద్రీయ వంటశాలను పరిశీలించిన ఈవో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీ-5ను తనిఖీ చేశారు. అక్కడ పనుల పురోగతి గురించి ఇంజినీరింగ్ అధికారులతో ఆరా తీశారు.
అనంతరం కౌస్తుభం, సప్తగిరి, ఎస్ఎంసీ, షాపింగ్ కాంప్లెక్స్ వద్ద హోటళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శిలా తోరణం వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు.
ఔటర్ రింగ్ రోడ్డులో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్మిస్తున్న నూతన క్యూలైన్లు, మరుగుదొడ్లు, ఫుడ్ కోర్టులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ శ్రీ సత్య నారాయణ, ఈ ఈ లు శ్రీ వేణు గోపాల్, శ్రీ సుబ్రహ్మణ్యం, డీ ఈ శ్రీ చంద్రశేఖర్, ఎస్టేట్స్ అధికారి శ్రీ వెంకటేశ్వరులు, డిప్యూటీ ఈఓ (హెల్త్) శ్రీమతి ఆశాజ్యోతి, హెల్త్ అధికారి డా. మధుసూదన ప్రసాద్, వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.