EO INSPECTS ARRANGEMENTS FOR PANCHAMI THEERTHAM _ శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో

Tirupati, 16 November 2023: TTD E Sri AV Dharma Reddy along with district SP Sri Parameshwar Reddy on Thursday inspected all arrangements for the prestigious Panchami Theertham fete slated for November 18 on the last day of the ongoing Karthika Brahmotsavam of Tiruchanoor temple.

 

Speaking to media later the TTD EO said all engineering arrangements for the auspicious fete including the installation of 3 German sheds with the capacity to accommodate 25,000 devotees were complete on the way to Tiruchanoor at Ayyappa temple, ZP High school and Pudi road junction.

 

He said arrangements are also made for the distribution of Anna Prasadam, coffee, milk, snacks, drinking water and separate toilets for men and women at the sheds.

 

Among others, separate gates for entry and exit, barricades, sign boards, coordinated activity of TTD vigilance and district police to ensure the safety and security of devotees.

 

He said the Chakra Snanam program will be held at 12 noon on November 18 and devotees will be given entry into the Pushkarani, one hour ahead only. He appealed to devotees to wait for their turn at the sheds and that the divinity of the holy bath lasts the entire day.

 

Earlier the EO and District SP inspected the queue lines, barricades at Pushkarini and all German sheds and made valuable suggestions to officials concerned.

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, SVBC CEO Sri Shanmukh Kumar, CE Sri Nageswar Rao, SE-3 Sri Satyanarayana, SE (electrical) Sri Venkateswarulu, Temple Dyeo Sri Govindarajan, Additional Health Officer Dr Sunil and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుపతి, 16 నవంబరు 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబరు 18వ తేదీన జరుగనున్న పంచమి తీర్థం ఏర్పాట్లను గురువారం టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజినీరింగ్‌ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. తిరుపతి నుండి తిరుచానూరుకు వచ్చే మార్గంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద, జడ్పీ హైస్కూల్లో మరియు పూడి రోడ్ వద్ద దాదాపు 25 వేల మంది వేచి ఉండేలా జర్మన్ షెడ్లు ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.

ఈ భక్తులకు షెడ్లలో అన్నప్రసాదము, కాఫీ, పాలు, అల్పాహారము, తాగునీరు అందిస్తామన్నారు. మహిళలకు పురుషులకు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు గేట్లు, బారికేడ్లు , సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండడంతో టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్ర‌తి ఏడాది పంచ‌మి తీర్థంకు విచ్చేసే భ‌క్తుల సంఖ్య పెరుగుతూ ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్లు ఈవో వివరించారు.

ప‌ద్మ‌పుష్క‌రిణిలో మధ్యాహ్నం 12 గంటలకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. షెడ్లలో వేచి ఉన్న భక్తులను చక్రస్నానంకు గంట ముందుగా పుష్కరిణి లోకి అనుమతిస్తామన్నారు. తెలిపారు. పంచమి తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలన్నారు.

అంతకుముందు ఈవో, జిల్లా ఎస్పీ, అయ్యప్ప స్వామి గుడి వద్ద, జడ్పీ హైస్కూల్లో, పూడి మార్గంలో ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లు, పద్మ పుష్కరిణి,క్యూ లైన్లు, బారికేడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు .

ఈ కార్యక్రమంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వి బిసి సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్ , సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ -3 శ్రీ సత్యనారాయణ, విద్యుత్ విభాగం ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌ గోవింద రాజన్, అదనపు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది