EO INSPECTS SVIMS, SPCHC _ స్విమ్స్ లో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన టిటిడి ఈవో

TIRUPATI, 28 MAY 2025: TTD EO Sri J Syamala Rao along with JEO Sri Veerabrahmam, inspected various constructions which are underway in Sri Venkateswara Institute of Medical Sciences(SVIMS) Super Specialty Hospital, Sri Balaji Institute of Oncology(SBIO) and Sri Padmavathi Children Heart Centre(SPCHC) in Tirupati on Wednesday.

As a part of his inspection, he visited the Patient-Attendant Ward, Cardio-Neuro Block, Central Kitchen, Doctors Quarters, Central Medical Stores, Renovation works and infra structure development in old SVIMS building, SBIO and Sri Padmavathi Children’s Heart Centre. 

The EO thoroughly verified the status of every building and made several valuable suggestions to the officials concerned on the progress of various works.

Director of SVIMS Dr RV Kumar, Director of SPCHC Dr Srinath Reddy, CE Sri Satyanarayan, SEs Sri Manoharam, Sri Venkateswarulu and other officials were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

స్విమ్స్ లో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన టిటిడి ఈవో

తిరుపతి, 2025, మే 28: స్విమ్స్ లో నిర్మాణంలో ఉన్న భవనాలను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ముందుగా రోగుల సహాయక వసతి గృహంలోని రోగులు వేచియుండే గదులు, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడే వున్న రోగులతో అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. స్విమ్స్ అందిస్తున్న వైద్య సేవలపై రోగులు సంతోషం వ్యక్తం చేశారు. రోగులు ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఎలాంటి వైద్యం కోసం వచ్చారు తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సిటి సర్జరీ తదితర వైద్య సేవల కోసం నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనంలో ఏ ఏ శాఖను ఏర్పాటు చేస్తారు, సదరు శాఖను నూతన భవనంలోకి తరలిస్తే, అప్పటి వరకు ఉన్న పాత భవనాన్ని ఏ శాఖకు కేటాయిస్తారనే విషయాలను క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. ఇన్ పేసెంట్స్ రినోవేషన్ బ్లాక్ ను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు తర్వాత సెంట్రల్ కిచెన్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్ భవనాలను, స్విమ్స్ శ్రీ పద్మావతీ ఆసుపత్రిని, నిర్మాణంలోని క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ , స్టాప్ క్వార్ట్స్ ను, శ్రీపద్మావతీ చిన్నపిల్లల హృదయాలయం భవనాలను పరిశీలించారు. నిర్మాణంలోని భవనాలు, మౌళిక సదుపాయాలు, పరికరాల వివరాలు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ ప్రొ. ఆర్వీ కుమార్, మెడికల్ సూపరింటెండ్ డా. రామ్, సీఈ శ్రీ టివి సత్యనారాయణ, ఎస్.ఈలు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ మనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.