EO INSPECTS TTD TREASURY DEPARTMENT _ ట్రెజరీ విభాగంలో ఈవో తనిఖీలు
Tirupati, 31 July 2021: TTD Executive Officer Dr KS Jawahar Reddy inspected the treasury department in TTD Administrative Building at Tirupati on Saturday.
He personally verified and reviewed the procedure of keeping safe the donations offered by devotees and the existing accounting systems.
Thereafter he visited the newly built Treasury Bhavan and made some valuable suggestions besides inspection of entry and exit routes of Parakamani staffs.
He also enquired about arrangements made for employees to change dress in secured rooms at the main gate.
TTD CVSO Sri Gopinath Jatti explained the CC camera installations and security alarms and vigilance arrangements in the Treasury Bhavan.
FA & CAO Sri O Balaji, CE Sri Nageswara Rao, Additional FA & CAO Sri Ravi Prasadudu, Treasury DyEO Sri Devendra Babu and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ట్రెజరీ విభాగంలో ఈవో తనిఖీలు
తిరుపతి, 2021 జూలై 31: తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలోని ట్రెజరీ విభాగాన్ని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శనివారం తనిఖీ చేశారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించే విధానం, వాటిని భద్రపరిచే ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం నూతనంగా నిర్మించిన ట్రెజరీ భవనాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరకామణి విధులకు హాజరయ్యే సిబ్బంది ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు. ట్రెజరీ కార్యాలయ ప్రధాన ద్వారం ముందు సిబ్బంది దుస్తులు మార్చుకునేందుకు, భద్రతా సిబ్బంది కోసం నిర్మించిన గదుల గురించి అడిగి తెలుసుకున్నారు. తగినన్ని సిసి కెమెరాలు, కార్యాలయం చుట్టూ ఏవిధమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నామనే విషయాన్ని సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఈవోకు వివరించారు.
ఈవో వెంట ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, అదనపు ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ రవిప్రసాదు, ట్రెజరీ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.