EO INSPECTS VARIOUS PLACES IN TIRUMALA _ తిరుమలలోని వివిధ ప్రాంతాలను తనిఖీ చేసిన టిటిడి ఈవో
TIRUMALA, 02 AUGUST 2024: TTD EO Sri J Syamala Rao along with Additional EO Sri Ch Venkaiah Chowdhary and JEO Smt Goutami inspected various places in Tirumala on Friday to verify the cleanliness and also interacted with the pilgrims to know their feedback.
Initially, he inspected the APTDC-run hotel at Annamaiah Bhavan followed by PAC2 Madhava Nilayam and also visited the new PAC 5 which is under construction. He instructed the engineering officials to complete the construction works within the stipulated time so as to accommodate more number of devotees.
Earlier, he also paved a visit to the SV Museum along with the TCS team which is under renovation, to monitor the progress of works.
CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, DE Electrical Sri Ravishankar Reddy, Museum Incharge officer Smt Vijayalakshmi and others were also present.
Later in the evening, the EO inspected the new kitchen at Panchajanyam, Outside line food courts, VQC compartments and Akshaya Kitchen. He interacted with the pilgrims in compartments and later made some valuable suggestions to the officers concerned.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలోని వివిధ ప్రాంతాలను తనిఖీ చేసిన టిటిడి ఈవో
తిరుమల, 2024 ఆగస్టు 02: టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీమతి గౌతమితో కలిసి శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించి, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
మొదట అన్నమయ్య భవనంలోని ఏపిటిడిసి నడుపుతున్న హోటల్‌ని, పిఎసి-2, మాధవ నిలయాన్ని పరిశీలించి, నిర్మాణంలో ఉన్న కొత్త పిఎసి -5ని కూడా తనిఖీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఉండేలా నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అంతకుముందు ఎస్వీ మ్యూజియంను ఆధునీకరిస్తున్న టిసిఎస్ బృందంతో కలిసి సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు.
అనంతరం పాంచజన్యం వసతి గృహం వద్ద నూతన వంటశాల, బయట ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, విక్యూసీ కంపార్ట్‌మెంట్లు, అక్షయ కిచెన్‌లను ఈఓ పరిశీలించారు. కంపార్ట్‌మెంట్లలో యాత్రికులతో మాట్లాడి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డీఈ ఎలక్ట్రికల్ శ్రీ రవిశంకర్ రెడ్డి, మ్యూజియం ఇంచార్జి అధికారిణి శ్రీమతి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.