EO LAUNCHES SOPHISTICATED PALM LEAF SCANNER _ ఈవో చేతుల‌మీదుగా అత్యాధునిక తాళపత్ర స్కానర్ ప్రారంభం

Tirupati,11 August 2023: TTD EO Sri AV Dharma Reddy along with JEO (H&E) Smt Sada Bhargavi on Friday inaugurated the sophisticated and latest document scanner imported from France.

Speaking on the occasion the TTD EO said with the objective of elevating the Sri Venkateswara palm leaf Research Institute as a model research organisation in the study of epigraphy, the TTD has extended all support with state-of-the-art equipment.

SVVedic University VC Acharya Rani Sadasiva Murty, Registrar Dr AV Radhe Shyam, Deans Sri Goli Subramanya, Dr Phaniyajulu, Head of Palm Leaf division Smt Vijayalakshmi, PRO Dr T Brahmacharyulu and other researchers, staff were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఈవో చేతుల‌మీదుగా అత్యాధునిక తాళపత్ర స్కానర్ ప్రారంభం

తిరుప‌తి, 2023 ఆగస్టు 11: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక తాళపత్ర స్కానర్‌ను శుక్ర‌వారం టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవితో క‌లిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర తాళపత్ర పరిశోధన సంస్థ దేశంలోనే అతిగొప్ప సంస్థగా ఎదగాలని, టీటీడీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. తాళపత్రాల్లో దాగి ఉన్న రహస్యాలను అందరికీ అందించాలని, ఇందుకోసం ఈ స్కానర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సంస్థ దేశంలోనే ప్రసిద్ధ తాళపత్ర పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వ‌ర్సిటీ ఉప‌కులపతి ఆచార్య రాణీ సదాశివమూర్తి, రిజిస్ట్రార్ డా. ఏ.వి.రాధేశ్యామ్‌, డీన్లు శ్రీ గోలి సుబ్రహ్మణ్య శర్మ, డా. ఫణియాజులు, తాళపత్ర విభాగాధిపతి శ్రీ‌మ‌తి విజయలక్ష్మి, పీఆర్వో డా. టి.బ్రహ్మాచార్యులు సిబ్బంది, పరిశోధకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.