EO OFFERS PRAYERS IN TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు
TIRUPATI, 26 JUNE 2024: TTD Executive Officer Sri J Syamala Rao on Wednesday offered prayers in Sri Padmavati Devi temple at Tiruchanoor during his maiden visit after taking reigns as EO of TTD.
On his arrival, he was welcomed by TTD JEO Sri Veerabrahmam. Later he offered prayers to Dhwaja Stambham, and after darshan he was rendered Vedaseervachanam by Vedic pundits.
DyEO Sri Govindarajan was also present.
Later, the EO entered his chamber in TTD Administrative Building in Tirupati after performing pujas.
Both the JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore welcomed the EO in the later’s chambers.
Others HoDs, employees also met the EO and extended their wishes.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు
తిరుపతి, 26 జూన్ 2024: టీటీడీ ఈవో జె.శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్ద జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఈవోకు స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆశీర్వాద మండపంలో ఆయనకు అర్చకులు వేద ఆశీర్వాదం చేశారు. తరువాత జేఈవో శ్రీ వీరబ్రహ్మం అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆగమ సలహాదారుశ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.
అంతకుముందు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల తమ కార్యాలయంలో ఈవో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తరువాత టీటీడీ అధికారులు, ఉద్యోగులు ఈవోను మర్యాదపూర్వకంగా కలిశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.