EO REVIEWS WITH VARIOUS DEPARTMENTS _ టిటిడిలోని వివిధ విభాగాలపై ఈవో సమీక్షి

Tirupati, 26 August 2024: TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdhary on Monday evening reviewed with various departments.

The review meetings were held in his chambers in TTD Administrative Building in Tirupati.

As part of the series of departmental meetings, EO reviewed with Srivari temple, Engineering works, Revenue and Panchayat, Reception, Sanitation and Annaprasadam wings.

He instructed all the concerned heads to improve and ensure pilgrim initiatives in their respective areas.

Both the JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Sridhar, CE Sri Nageswara Rao, heads of various other departments that were reviewed, also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడిలోని వివిధ విభాగాలపై ఈవో సమీక్షి

తిరుపతి, 2024 ఆగస్టు 26: టీటీడీలోని వివిధ విభాగాలపై ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సోమవారం సమీక్షించారు.

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఆయన ఛాంబర్‌లో ఈవో సమీక్ష నిర్వహించారు.

శాఖాపరమైన సమావేశాలలో భాగంగా శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్ పనులు, రెవెన్యూ, పంచాయతీ, రిసెప్షన్, పారిశుధ్యం, అన్నప్రసాదం విభాగాలతో ఈఓ సమీక్షించారు.

ఆయా ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధిపతులందరికీ ఆయన సూచించారు.

ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవిఎస్‌వో శ్రీ శ్రీధర్‌, సీఈ శ్రీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.