EO TAKES PART IN ACHARYA RITWIK VARNAM IN KRT _ శ్రీ కోదండరామాలయంలో ఆచార్య రుత్విక్‌వరణంలో పాల్గొన్న టిటిడి ఈవో
TIRUPATI, 03 AUGUST 2021: The Executive Officer Dr KS Jawahar Reddy took part in the Acharya Ritwik Varanam ritual held in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Tuesday.
Speaking on the occasion the EO said, the ritual was held in connection with annual Pavitrotsavams which are commencing from August 4 onwards.
He said, in the evening of Tuesday Ankurarpanam will be held. Usually, the Pavitrotsavams are conducted to ward off sins committed unintentionally by the temple archakas, staff and even devotees. Due to Covid restrictions, this fete will be observed in Ekantam, he maintained.
Special Gr Dy EO Smt Parvathi and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కోదండరామాలయంలో ఆచార్య రుత్విక్‌వరణంలో పాల్గొన్న టిటిడి ఈవో
తిరుపతి, 2021 ఆగస్టు 03: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుండి 6వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహించారు. టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అర్చకులకు విధుల కేటాయింపునే రుత్విక్‌వరణం అంటారు. యాగకర్మలు, పుణ్యాహవచనం, హోమాలు తదితర వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతలు అప్పగిస్తారు. సాక్షాత్తు స్వామివారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు. కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినిపూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయని, వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, ఆగమసలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ జయకుమార్, శ్రీ మునిరత్నం పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.