ESTABLISHING SOCIAL HARMONY THROUGH THE PATH OF DEVOTION IS THE PRIME OBJECTIVE – JEO (HEALTH & EDUCATION) _ భక్తిమార్గంలో సమాజ శాంతి నెలకొల్పడమే ప్రధాన లక్ష్యం
Tirumala, 10 February 2026: The TTD JEO for Health& Education, Dr. A. Sarath said that the main objective of the Dasa Sahitya Project of TTD is to establish peace in society through the path of devotion.
The three-day Srivari Quarterly Metlotsavam concluded on Tuesday at the Asthana Mandapam in Tirumala.
Addressing devotees as the chief guest the JEO said the Metlotsavam promotes Dharma and the protection of Sanatana Dharma.
He urged volunteers and sevaks who came from various villages to spread devotion among the people as representatives of Sri Venkateshwara.
He stated that the path of devotion is the foundation for individual, family, and social peace, and that chanting the divine name of Sri Venkateswara.
Special Officer of the Dasa Sahitya Project, Sri Ananda Theerthacharyulu, said that participating in Metlotsavam once yields the merit of having the darshan of the Sri Venkateshwara 108 times.
Preachers and bhajana mandali members from Andhra Pradesh, Tamil Nadu, and Karnataka participated in large numbers.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
భక్తిమార్గంలో సమాజ శాంతి నెలకొల్పడమే ప్రధాన లక్ష్యం
శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ప్రారంభోత్సవంలో టీటీడీ జేఈవో (వైద్య, విద్య) డాక్టర్ ఏ.శరత్
తిరుమల, 2026 ఫిబ్రవరి 10: టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్తిమార్గంలో సమాజ శాంతి నెలకొల్పే ప్రధాన లక్ష్యమని టీటీడీ జేఈవో (వైద్య, విద్య) డాక్టర్ ఏ.శరత్ అన్నారు.
తిరుమలలో మూడురోజుల పాటు నిర్వహించిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం ఆస్థాన మండపంలో మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
తిరుమలలో నిర్వహించిన మెట్లోత్సవం కార్యక్రమం ద్వారా ధర్మ ప్రచారం, సనాతన ధర్మ సంరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామ గ్రామాల నుండి విచ్చేసిన వాలంటీర్లు, సేవకులు స్వామివారి ప్రతినిధులుగా భక్తిని ప్రజల్లో వ్యాప్తి చేయాలన్నారు.
భక్తిమార్గమే వ్యక్తిగత శాంతికి, కుటుంబ శాంతికి, సమాజ శాంతికి పునాదని, శ్రీవేంకటేశ్వర స్వామి నామస్మరణే దీనికి మూలమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ ఒక్కసారి మెట్లోత్సవంలో పాల్గొంటే 108 సార్లు స్వామివారిని దర్శించుకున్న పుణ్యఫలం దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రవచనకర్తలు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకు చెందిన భజన మండలి సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.




