EXTENSIVE PREPARATIONS FOR AMARAVATI SV TEMPLE MAHA SAMPROKSHANA- TTD EO _ అమరావతిలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirumala, 30, May 2022: TTD EO Sri AV Dharma Reddy has directed officials to make elaborate and extensive arrangements for the Maha Samprokshana fete newly built Sri Venkateswara temple, Amaravati scheduled from June 4-9.
Addressing a review meeting on Monday at Sri Padmavati rest house the TTD EO directed engineering officials to install icons of Shank and Chakra Nama with high visibility, public address systems, fans, signboards and uninterrupted power supply.
He instructed officials to make arrangements for an adequate supply of Anna Prasadam, drinking water, toilets, sheds etc. for huge crowds expected on June 9, Maha Samprokshana fete.
Among others, TTD EO asked officials to organise an adequate number of archaka and other staff on deputation, their accommodation, ornaments for events, greenery all around and security for all VIPs, Srivari Sevakulu for queue lines and other services.
He directed TTD officials should coordinate with district administration and complete all arrangements within schedule.
TTD JEO Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, FACAO Sri O Balaji, CE Sri Nageswar Rao and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అమరావతిలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2022 మే 30: అమరావతిలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 4 నుండి 9వ తేదీ వరకు జరుగనున్నాయని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లపై సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దూరం నుంచి చూసినా కనిపించేలా ఈ ఆలయం వద్ద శంఖుచక్రనామాలు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాన్ని సులువుగా గుర్తించేలా అవసరమైన ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. జూన్ 9న మహాసంప్రోక్షణ రోజు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
ఆరు రోజుల పాటు జరుగనున్న ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు తగినంతమంది అర్చక సిబ్బందిని, ఇతర సిబ్బందిని డెప్యుటేషన్‌పై పంపాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిసరాలను పచ్చని మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. మహాసంప్రోక్షణకు ముఖ్యమైన ప్రముఖులు విచ్చేసే అవకాశం ఉండడంతో తగిన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయానికి అవసరమైన ఆభరణాలు అందించాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. క్యూలైన్ల నిర్వహణ కోసం, భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని నిర్ణీత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు.
ఈ సమీక్షలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.