FACILITIES AT TIRUCHANOOR ON THE LINES OF TIRUMALA- EO SINGHAL_ తిరుమ‌ల త‌ర‌హాలో తిరుచానూరులో సౌక‌ర్యాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tiruchanoor, 20 Mar. 19: TTD is contemplating to develop devotee facilities at Tiruchanoor akin to Tirumala to match day by day growing pilgrims number said Executive Officer Sri Anil Kumar Singhal.

Speaking to media after inspecting the Tiruchanoor temple along with Tirupati JEO Sri B Lakshmi Kantham and CVSO Sri Gopinath Jatti on Wednesday he said adequate facilities were created at Tiruchanoor temple in the recent times which is attracting daily 30,000 devotees at present.

Arrangements were made to remove grills at both Sri Padmavathi Ammavari Temple and Sri Govindaraja Swamy Temple so that devotees could get good darshan and divine elixir of deities and enjoy the architectural beauty of historic temples.

The EO said repair of Ratham at Tiruchanoor was taken up and the store room in the temple shifted to the to Anna Prasadam Bhavan and the space used as waiting hall for devotees.

He said officials have been instructed to build a covered pathway on the road from temple to new Anna Prasadam complex in the Tholappa Gardens.

He also inspected the temple Potu, old Anna Prasadam complex, footwear counters and others. Steps taken for a chappal stand, cell phone deposit counter and a bookstall, all under one roof, he said.

Earlier the EO also inspected the rooms, dormitories, entry path, sign boards, prayer hall, reception hall, drinking water, bank ATMs at Sri Padmavathi nilayam guest house, and directed officials to ensure that electrical wiring was covered and exposed.

The EO also inspected the new hostel block at Sri Govindaraja Arts College and directed officials to provide quality work and deliver on schedule.

SE-1 Sri Ramesh Reddy, SE-4 Sri Ramulu, SE Electrical Sri Venteswarlu, DFO Sri Phanindra Naidu, DE Sri Ravi Shankar Reddy, DyEOs Smt Jhansi Rani and Sri Ramamurthy Reddy and others participated.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమ‌ల త‌ర‌హాలో తిరుచానూరులో సౌక‌ర్యాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుప‌తి, 2019 మార్చి 20: తిరుచానూరులో భ‌క్తుల ర‌ద్దీ పెరుగుతున్న క్ర‌మంలో తిరుమ‌ల త‌ర‌హాలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల హాస్ట‌ల్ బ్లాక్‌ను బుధ‌వారం తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతంతో క‌లిసి ఈవో ప‌రిశీల‌న చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరును రోజుకు స‌రాస‌రి 30 వేల మంది భ‌క్తులు సంద‌ర్శిస్తున్నార‌ని, వీరికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వివ‌రించారు. భ‌క్తుల్లో ఆధ్యాత్మిక భావ‌న మ‌రింత పెంచేలా తిరుమ‌ల త‌ర‌హాలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యాల్లో గ్రిల్స్ తొల‌గించి దేవ‌తామూర్తుల శిల్పాల‌ను ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు. తిరుచానూరులో ర‌థం మ‌ర‌మ్మ‌తులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఆల‌యంలోని స్టోర్ గ‌దిని పాత అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలోకి మార్చాల‌ని, అదేవిధంగా ఈ భ‌వ‌నాన్ని భ‌క్తులకు వేచి ఉండే హాలుగా వినియోగించాల‌ని అధికారుల‌కు సూచించామ‌న్నారు. ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యం నుండి భ‌క్తులు తోళ‌ప్ప‌గార్డెన్స్‌లోని నూత‌న అన్న‌ప్ర‌సాద భ‌వ‌నానికి వెళ్లేందుకు సౌక‌ర్య‌వంతంగా రోడ్డుకు ఒక‌వైపున దారి పొడ‌వునా షెడ్ ఏర్పాటుచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంట‌ర్‌, పాద‌ర‌క్ష‌లు భ‌ద్ర‌ప‌రుచుకునే కౌంట‌ర్‌, పుస్త‌క‌విక్ర‌య‌శాల ఒకేచోట ఉండేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. అంత‌కుముందు ఆల‌యం, క్యూలైన్లు, పోటు, పాత అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, పాద‌ర‌క్ష‌ల కౌంట‌ర్ త‌దిత‌ర ప్రాంతాల‌ను ప‌రిశీలించారు.

శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యంలో త‌నిఖీలు

తిరుచానూరులో భ‌క్తుల సౌక‌ర్యార్థం నిర్మించిన శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యం వ‌స‌తి స‌ముదాయంలో ఈవో త‌నిఖీ చేప‌ట్టారు. ఇక్క‌డ గ‌దులు, డార్మెట‌రీలు, ప్ర‌వేశ‌మార్గం, సూచిక‌బోర్డులు, ప్రార్థ‌న హాలు, రిసెప్ష‌న్ హాలు, భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన ఆర్‌వో తాగునీటి వ‌స‌తి, బ్యాంకు ఎటిఎం కేంద్రాలను ప‌రిశీలించారు. వైర్లు బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా వైరింగ్ చేయాల‌న్నారు.

అనంత‌రం తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల‌లో రూ.9 కోట్ల‌తో నిర్మిస్తున్న హాస్ట‌ల్ బ్లాక్‌ను ఈవో ప‌రిశీలించారు. నిర్మాణ ప‌నుల‌ను నాణ్యంగా చేప‌ట్టాల‌ని, స‌కాలంలో పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను, కాంట్రాక్ట‌ర్‌ను ఆదేశించారు.

ఈవో వెంట టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఎస్ఇ-4 శ్రీ ఎ.రాములు, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్‌నాయుడు, డిఇ శ్రీ ర‌విశంక‌ర్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, శ్రీ రామ్మూర్తిరెడ్డి ఇత‌ర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.