FELICITATION TO EMPLOYEES IS AN HONOUR- TTD JEO _ ఉద్యోగులను గౌరవంగా సన్మానించుకోవాలి – జె ఈవో శ్రీమతి సదా భార్గవి
Tirupati, 31 August 2021: TTD Joint Executive Officer Smt Sada Bhargavi said that the EO Dr KS Jawahar Reddy affirmed that all employees who spent long years in service of devotees with the blessings of Sri Venkateswara should be treated with respect and dignity on their day of retirement.
She participated in a function in which 13 employees who laid down their office were felicitates at the Conference Hall in TTD Administrative building on Tuesday.
Speaking on the occasion the JEO expressed best wishes to all retiring employees and said the festival-like bidding farewell was a pleasant occasion.
She said Sri Venkateswara would bless all the retiring employees with health and cheerful life in future.
After presenting shawls, bouquets etc. all of them along with their family members were rendered Veda Ashirvachanam by the TTD Vedic pundits.
TTD Welfare Wing DyEO Sri Ananda Raju, PRO Dr Ravi, TTD Dharmic project program Officer Sri Vijaya Saradhi, several officials and employees association leaders were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఉద్యోగులను గౌరవంగా సన్మానించుకోవాలి- జె ఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి 31 ఆగస్టు 2021: భగవంతుని సేవలో,భక్తుల సేవలో సుదీర్ఘ కాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారిని గౌరవంగా సన్మానించు కోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి భావించారని జెఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు.
టీటీడీ లోని వివిధ విభాగాల్లో పని చేస్తూ మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన 13 మందికి పరిపాలన భవనం ఆవరణంలోని సమావేశం హాలులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జెఈవో శ్రీమతి సదా భార్గవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పని చేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ వాతావరణంలో ఇలాంటి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం ఆనందకరమన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారంతా శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యం గా గడిచేలా శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆశీస్సులు అందించాలని కోరారు. వీరందరికీ శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం వీరందరికీ కుటుంబసభ్యులతో సహా అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు. సంక్షేమ విభాగం డిప్యూటి ఈవో శ్రీ ఆనంద రాజు, పిఆర్వో డాక్టర్ రవి, టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల కార్యక్రమాల అధికారి శ్రీ లంకా విజయసారథి తో పాటు పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ చేసింది వీరే
శ్రీ.డి.వెంకట సుబ్బయ్య ( సూపరింటెండెంట్) శ్రీ ఆర్.భాస్కరయ్య ( ఆఫీస్ సబార్డినేట్) శ్రీ.పి.నరసింహులు ( సీనియర్ అసిస్టెంట్) శ్రీ కె.తిరుపాల్ ( ఆఫీస్ సబార్డినేట్) శ్రీ పి. రామ్మూర్తి ( అసిస్టెంట్ షరాబ్) శ్రీ పి.నాదముని ( దఫెదార్) శ్రీమతి కె ఎల్లమ్మ ( దఫెదార్) శ్రీ ఎం. ఎస్. గంగాధరం ( మజ్దూర్) శ్రీ ఆర్.కృష్ణయ్య ( కేటరింగ్ సూపర్ వైజర్) శ్రీ.కె వెంకట ముని కృష్ణా రెడ్డి ( డ్రైవర్) శ్రీ ఐ. మల్లారెడ్డి ( ప్లేట్ మేకర్) శ్రీ డి.జగన్నాథం ( గార్డెనర్) శ్రీ.డి.భాస్కరరెడ్డి ( పడితారం క్యారియర్)
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది