Felicitation to Retired TTD Employees in TTD Transport _ తితిదే రవాణా విభాగంలో విశ్రాంతి ఉద్యోగులను సన్మానించిన ఈవో

Tirupati, 17 Feb 10: Sri I.Y.R.Krishna Rao, Executive Officer, TTDs has today felicitated 62 TTD Drivers on attaining superannuation from Service in TTD Transport premises, Tirupati.

 
Sri Sesha Reddy, G.M.Transport, Sri T.A.P.Narayana, Spl Gr. Dy.EO(Services) and others were present.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తితిదే రవాణా విభాగంలో విశ్రాంతి ఉద్యోగులను సన్మానించిన ఈవో

తిరుపతి, 2010 ఫిబ్రవరి 18: తితిదేలో సుదీర్ఘకాలం భక్తుల సేవలో తరించిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఆధ్యాత్మిక చింతనను అలవరచుకోవాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు అన్నారు.

గురువారం ఉదయం తితిదే రవాణా విభాగంలో విశ్రాంతి ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా విభాగంలో పనిచేసే డ్రైవర్లు, కార్మికులు ఎంతో ఓర్పుతో, నేర్పుతో తమ విధులు నిర్వర్తించాల్సి వుంటుందని, ఆవిధంగా వారు భక్తుల మన్ననలను పొందాలన్నారు. అదేవిధంగా పదవీ విరమణ చేసిన తర్వాత వారు తమ ఆరోగ్య సంరక్షణ కొఱకై ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవడం ద్వారా చెడు అలవాట్లకు దూరంగా వుండడమే గాకుండా ప్రశాంత జీవనానికి మార్గం సుగమం చేసుకోవచ్చని ఆయన అభిలషించారు.

ఈ సందర్భంగా ఆయన 62 మంది విశ్రాంతి ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.              

ఈ కార్యక్రమంలో తితిదే రవాణా విభాగం జనరల్‌ మేనేజర్‌ శ్రీ పి.వి.శేషారెడ్డి, డిప్యూటీ ఇఓ (సేవలు) శ్రీ టి.ఏ.పి. నారాయణ, ట్రాన్స్‌పోర్టు ఉద్యోగుల సంఘ నాయకులు శ్రీ బి. ఈశ్వరరెడ్డి,    శ్రీ పి. రాజేంద్ర, శ్రీ ఎం.అశోకన్‌, శ్రీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.