Fifteen states showcase their expertise with different art forms _ గరుడ సేవలో భక్తులను మైమరపింపచేసిన 15 రాష్ట్రాల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు
Tirumala, 08 October 2024: Besides the Souther States artistes from Rajasthan, Gujrat, Odisha, MP, Maharashtra, Punjab, Manipur, Tripura, Jharkhand, UP and Assam presented unique art forms in front of Garuda Vahana Seva on Tuesday evening.
The colourful Chari of Rajastan, Tippani Garbha of Gujrat, Maharashtra’s Lavani Gondal, Bundelkhand dance of MP, Tripura’s Allam Jimpan, Jharkhand’s Mundari stood special.
While the Vasanthotsava presentation of Utsava deities where in Sri Malayappa along with Sridevi and Bhudevi, Sri Sita Rama Lakshmana Anjaneya, Sri Krishna with Rukmini Satyabhama were beautifully portrayed by the students of TTD run SV College of Music and Dance.
Thimsa of Telengana, Kolatams of AP, Bharatnatyam from TN, Kerala Drums and Mayura Nrutam, Pondicherry ‘s dance form mused the devotees.
A total of 28 teams consisting 718 artistes performed before Garuda Vahanam and enhanced the grandeur of the spectacular procession.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గరుడ సేవలో భక్తులను మైమరపింపచేసిన 15 రాష్ట్రాల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు
• కళాబృందాల ప్రదర్శనతో పులకించిన సప్తగిరులు
తిరుపతి, 2024 అక్టోబరు 08: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు మంగళవారం రాత్రి గరుడ వాహన సేవలో సాంస్కృతిక వైవిధ్యం కనిపించేలా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంప్రదాయ కళలను చక్కగా ప్రదర్శించారు.
ఆంద్రప్రదేశ్ తో పాటు రాజస్థాన్, తెలంగాణ, పాండిచ్చేరి, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, పంజాబ్, మహారాష్ట్ర, మణిపూర్, కేరళ, త్రిపుర, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, అస్సాం 15 రాష్ట్రాల నుండి విచ్చేసిన ఆయా రాష్ట్రాల సుప్రసిద్ధ, జానపద కళారూపాల ప్రదర్శనతో భక్తులను భక్తి సాగరంలో ముంచారు. తిరుమాడ వీధులు భారతీయ తాత్విక చింతనతో పులకించి, మురిసిపోయింది. మొత్తం 28 కళా బృందాలు 713 మంది కళాకారులు పాల్గొన్నారు.
రాజస్థాన్ కు చెందిన శ్రీ రూప్ సింగ్ బృందం ప్రదర్శించిన చారి రూపకం, తెలంగాణ నుండి శ్రీ అశోక్ బృందం థింసా నృత్యం, తెలంగాణ శ్రీ గోపీనాథ్ బృందం నుండి బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవం రూపకం, గుజరాత్ కు చెందిన శ్రీ చేతన్ జెట్వా బృందం ప్రదర్శించిన తిప్పని గర్భ జానపద నృత్యం, మధ్యప్రదేశ్ కు చెందిన శ్రీ మయాంక్ తివారీ బుందేల్ఖండ్ నృత్య విన్యాసాలు ఆలరించాయి. ఒరిస్సాకు చెందిన శ్రీ రవినారాయణ్ భూమి నృత్యం , హైదరాబాద్ కు చెందిన శ్రీమతి శ్వేత భంగ్ర నృత్యం, మహారాష్ట్రకు చెందిన డా. రాహుల్ హాలడే ప్రదర్శించిన లావని గోందల్ నృత్యం, కేరళకు చెందిన శ్రీరవీంద్ర నంబియార్ బృందం ప్రదర్శించిన మయూర నృత్యం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.
మణిపూర్ కు చెందిన శ్రీమతి గోవిందమ్మ ప్రదర్శించిన సాంప్రదాయ మణిపూరి నృత్యం, త్రిపురకు చెందిన శ్రీ అల్లంజంపన్ ప్రదర్శించిన కొరియా వంగళ నృత్యం, జార్ఖండ్ కు చెందిన శ్రీ అన్సర్ దివాకర్ ప్రదర్శించిన ముండరి నృత్యం, కేరళకు చెందిన శ్రీ మహదేవన్ ప్రదర్శించిన ఒరియాడి నృత్యం , అస్సాంకు చెందిన శ్రీ జోయ్ దేవ్ అస్సామిబిహు నృత్యం, ఉత్తర ప్రదేశ్ కు చెందిన శ్రీ ఉమాశంకర్ దేల్ల బృందం ప్రదర్శించిన కజరీ నృత్యం భక్తిరసాన్ని నింపాయి.
తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, శ్రీమతి శోభారాణి, శ్రీ వంశీధర్, శ్రీ శ్రీనివాసులు, శ్రీమతి కోకిల కోలాట బృందాల ప్రదర్శన, కడప మరియు రాజమండ్రికి చెందిన డప్పుల విన్యాసాలు, కర్నాటకకు చెందిన శ్రీమతి ఇందు భరత నాట్యం, తిరుపతికి చెందిన డా. మురళీకృష్ణ బృందం ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణ రూపకం భక్తులును పరవసింపచేసింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.