FIFTY CENTURIES OLD CELESTIAL MARRIAGE REPLICATED _ కన్నుల పండువగా శ్రీ గోదా కళ్యాణం
TTD PERFORMS GODA KALYANAM IN TIRUPATI
DENIZENS PARTICIPATE IN FETE FOLLOWING COVID NORMS
Tirupati, 14 Jan. 21: On the last day of Dhanurmasam, the divine wedding ceremony of Goda Kalyanam was performed with celestial grandeur by TTD in the Parade Grounds behind TTD Administrative Building in Tirupati on a pleasant evening on Thursday.
The Hindu Dharma Prachara Parishad (HDPP) Secretary Sri Rajagopalan who anchored the whole event while narrating about the significance of Goda Kalyanam said that like Sita Kalyanam in Treta Yuga, Rukmini Kalyanam in Dwapara Yuga, Padmavathi Parinayam in Kaliyuga, similarly Goda Kalyanam is equally important as it was observed 5000 years ago wherein Andal Sri Godai tied the knot to Sri Krishna Swamy.
Adding further he said, the same episode was replicated today in the Temple City on the auspicious day of Makara Sankranti.
GODA AND SRI KRISHNA SWAMY KALYANAM
Earlier, the deities of Andal Sri Goda Devi and Sri Krishna Swamy, finely decked in dazzling jewels and bright silks were brought and seated on a special platform on the stage of Parade Grounds.
SERIES OF EVENTS IN KALYANAM
Archakas performed Kalyanam in a colourful manner by chanting Vedic hymns. The marriage observed with utmost devotion and grandeur with a series of events including Punyahavachanam, Vishwaksena Aradhana, Ankurarpanam, Kankanadharana, Pratisarabandhana Puja, Sankalpam, later the Gotra Namas of deities were recited with Gargeya Gotra for Sri Krishna Swamy and Bhargava Gotram for Goda Devi and Kanyadana Mahotsavam, Mangalyadharanam, Varanamayiram, Naivedyam and Mangala Harati performed.
ANNAMACHARYA SANKEERTANS ENTHRALL
The spiritual fervour of the programme enhanced with the rendition of Annamacharya Sankeertans.
MP Sri Vemireddi Prabhakar Reddy, TTD EO Dr KS Jawahar Reddy, Board Member Smt Prasanthi Reddy, Additional EO Sri AV Dharma Reddy and others were also present.
DEVOTEES OVERWHELMED
Devotees who thronged the celestial marriage event were overwhelmed as the Goda Kalyanam is performed for the first time by TTD for the denizens in a grand manner as a part of its month-long Dhanurmasa Utsavams which concluded on January 14.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
కన్నుల పండువగా శ్రీ గోదా కళ్యాణం
– పెద్ద సంఖ్యలో భక్తులు, అధికార,అనధికారుల హాజరు
తిరుపతి 14 జనవరి 2021: ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్బంగా గురువారం రాత్రి తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ఆవరణంలోని మైదానంలో శ్రీ కృష్ణ శ్రీ గోదా దేవి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. టీటీడీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ గోదాదేవి ఆవిర్భావం, గోదా కళ్యాణం ప్రాశస్త్యం గురించి వివరించారు. 5 వేల సంవత్సరాల క్రితం జరిగిన శ్రీ గోదా కళ్యాణం శ్రీవారి దయతో నేడు భక్తులు మళ్ళీ చూడగలిగే భాగ్యం కలిగిందన్నారు. ధనుర్మాసానికి వీడ్కోలు, మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ గోదా కల్యాణం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.శ్రీ గోదాదేవి శ్రీ వేం కటేశ్వర స్వామివారి మీద రోజుకో పాశురం కీర్తించి స్వామివారి సరసన నిలిచిన మహా భక్తురాలని చెప్పారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శేషాచల కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు శ్రీకృష్ణ స్వామి, శ్రీ గోదా దేవి కళ్యాణం కోసం పుణ్యాహవచనం, విష్వక్సేన ఆరాధన, అంకురార్పణ, కంకణ పూజ నిర్వహించారు. తొలుత సర్కారు సంకల్పం, అనంతరం భక్తులందరితో సంకల్పం చేయించారు. ఆభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించిన శ్రీ గోదాదేవి శ్రీ కృష్ణ స్వామి వారికి కంకణాలు కట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం అర్చకులు శ్రీ గోదాదేవి రచించిన 10 పాశురాలను పఠిస్తూ, వారణ మాయిరం క్రతువు నిర్వహించారు. చివరగా నివేదన, మంగళ హారతితో కళ్యాణ వేడుక ముగిసింది.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీవారిని వైభవాన్ని చాటుతూ కీర్తనలు ఆలపించారు. మైదానంలోని భక్తులు సామూహికంగా గోవింద నామాలు పఠించారు.
రాత్రి 8.30 గంటలకు ఈ వేడుక ముగిసింది.
కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి దంపతులు, అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సతీమణి శ్రీమతి స్వర్ణలత రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటి ఈవో శ్రీ హరీంద్ర నాథ్, శ్రీవారి ఆలయ ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి, విజఓ శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది