FINE ARTS DISPLAY _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కళా వైభవం

TIRUPATI, 11 NOVEMBER 2023: Its a display of an array of traditional arts by the various artists from different states during ongoing Tiruchanoor brahmotsavams.

Saturday evening witnessed unique art forms like Astalakshmi Nritya Rupakam, Mayura Nrityam, Kerala Drums, Tappeta Gullu in front of Hamsa Vahanam.

The various stages hosted different dance and music art forms which amused the devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కళా వైభవం
 
తిరుప‌తి, 2023 నవంబరు11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలతోపాటు పలు వేదికలపై నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా రెండో రోజు శనివారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.
 
హంస వాహనసేవలో…
 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి హంస వాహన సేవలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు చక్కటి కళారూపాలను ప్రదర్శించారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులు అన్నమయ్య సంకీర్తనలకు సంప్రదాయ నృత్యం చేశారు. అదేవిధంగా అనంతపురానికి చెందిన శ్రీకృష్ణ నాట్యాలయ బృందం అష్టలక్ష్మి నృత్య రూపకం, గౌరీ పట్నానికి చెందిన సురేష్ బృందం దీప నృత్యం, తమిళనాడుకు చెందిన రాగిణి సంగీత నృత్యాలయ బృందం భరతనాట్యం, చెన్నైకి చెందిన భారత కళ అకాడమీకి చెందిన కళాకారులు అష్టలక్ష్మి స్తోత్రం పూజ కడిగం, మూవాను కళారూపాలను చక్కగా ప్రదర్శించారు. వీటితోపాటు నెమలి నృత్యం, తప్పెటగుళ్ళు, కేరళ డ్రమ్స్ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
 
తిరుచానూరులోని ఆస్థానమండపంలో…
 
తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం మంగళధ్వని, వేద పారాయణం నిర్వహించారు. అనంతరం డాక్టర్ సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు భక్తామృతం ధార్మికోప‌న్యాసం, బెంగళూరుకు చెందిన శ్రీ‌మ‌తి రూపశ్రీ బృందం భక్తి సంగీతం వినిపించారు. మధ్యాహ్నం తిరుపతికి చెందిన శ్రీమతి వరలక్ష్మీ బృందం హ‌రిక‌థ, సాయంత్రం శ్రీ సరస్వతీ ప్రసాద్, కుమారి లక్ష్మీరాజ్యం బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు, ఊంజ‌ల్‌సేవ‌లో శ్రీ రఘునాథ్ బృందం సంకీర్త‌న‌లు ఆల‌పించారు.
 
ఇతర వేదికలపై..
 
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు సురభి కళాకారులు మాయాబజారు నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. 
 
అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు అనంతపురానికి చెందిన శ్రీ అర్జున్ భరద్వాజ్ బృందం నృత్యం చక్కగా  ప్రదర్శించారు.
 
రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు హైదరాబాదుకు చెందిన శ్రీమతి లక్ష్మీ బృందం భక్తిసంగీతం వినిపించారు. 
 
తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు మచిలీపట్నానికి చెందిన శ్రీ వైష్ణవి నృత్యాలయ బృందం కూచిపూడి నృత్య కార్యక్రమం నిర్వహించారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.