FIRST PHASE OF VAHANA SEVAS CONCLUDES IN A COLOURFUL MANNER _ సూర్యప్రభవాహనంపై సకలలోక రక్షకుడు
LORD TAKES RIDE ON SURYAPRABHA, CHINNA SESHA, GARUDA AND HANUMANTHA WITH PRIDE IN THE FIRST HALF DAY
Tirumala, 19 February 2021: As part of the Ratha Sapthami festival on the asupcious occasion of Surya Jayanthi on Friday, Sri Malayappa Swamy donned different guises and took a celestial ride on Seven vahanams from dawn to dusk to cheer pilgrims.
During the first half of the day starting with Suryaprabha Vahanam at 5:30am, the utsava idol of Sri Malayappa dressed in rich jewels and floral decorations enthralled and blessed the devotees on Chinna Sesha Vahanam between 9am and 10am, on Garuda Vahanam between 11am and 12noon and on Hanumantha Vahanam between 1pm and 2pm and blessed His devotees.
For the first time since COVID-19, TTD had organised the Ratha Sapthami vahana sevas on Mada streets by permitting only the darshan ticket or token holders to come to Tirumala and participate in daylong festivities of seven vahana sevas. A peep into the Vahana Sevas, which enthralled devotees in spiritual fervour during the first half.
SURYA PRABHA VAHANAM:
Legends says that the Sun God, the key architect of life on earth, is being dragged by seven horses with Anura as His charioteer. Sun God is symbolically represented for blessing with good health and a bright future. The mythology says that the darshan of Sri Malayappa on Surya Prabha Vahanam will provide long life, good health and prosperity to devotees. Sri Malayappa as Suryanaraynamurthy blessed the devotees on the first vahanam-the Suryaprabha Vahanam.
CHINNA SESHA VAHANAM
The Chinna Shesha Vahanam is the second one where in Sri Malayappa as in His original form as Venkatadrivibhudu blessed the devotees. According to mythology, Chinnasesha is the personification of Vasuki – the King of serpents. To make the human race conscious of the divine Kundalini energy the Lord has taken ride on Chinna Sesha Vahanam.
GARUDA VAHANAM
The Third vahana among the sequence of the Saptha Vahana Sevas during Ratha Sapthami is the most sought after Garuda vahana seva, believed to be the most favourite carrier to Lord Himself. During last year, due to Covid pandemic as the devotees missed Garuda Vahana Seva in both the brahmotsavams which were performed in Ekantam, the Garuda Vahana seva provided cynosure to the eyes of tens of thousands of devotees who converged in galleries on Friday.
HANUMANTHA VAHANA
The first half of Radha Sapthami concluded with Hanumanta vahanam on Friday. Lord Malayappa on Hanumantha Vahanam took out a majestic ride to bless His devotees.
Hanuman is usually considered as an icon of devotional bliss. Lord Hanuman symbolically stands for pure devotion, complete surrender and absence of ego. His character tells us what we can do in our lives by becoming pure. Hanuman represents the tenets of devotion and Sharanagathi in its both physical means and also in intellectual form.
TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Dr KS Jawahar Reddy, Addl EO Sri AV Dharma Reddy, TTD Board Members Sri Parthasarathi Reddy, Sri Chippagiri Prasad, Sri Shivakumar, Sri DP Anantha, Smt Prasanthi Reddy, Dr Nischitha, Sri Govinda Hari, TTD CVSO Sri Gopinath Jatti, Uraban SP Sri Venkata Appala Naidu and others took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సూర్యప్రభవాహనంపై సకలలోక రక్షకుడు
తిరుమలలో వైభవంగా రథసప్తమి
తిరుమల, 2021 ఫిబ్రవరి 19: సూర్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి అంగరంగ వైభవంగా నిర్వహించింది. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలిచే ఈ ఉత్సవంలో నిర్వహించిన వాహనసేవలను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించడం విశేషం. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి.
సూర్యప్రభ వాహనం (ఉదయం 5.30 గం||ల నుండి 8 గం||ల వరకు) : అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.
ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’ :
రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టిటిడి శ్రీవేంకటేశ్వర బాలమందిరంలో చదుకుంటున్న 130 మంది విద్యార్థులు ఆలపించిన ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’ సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. ఐదేళ్లుగా బాలమందిరం విద్యార్థులు శ్లోకాలు ఆలపిస్తున్నారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం తదితర సంస్కృత శ్లోకాలు ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ శ్లోక పారాయణంలో పాల్గొన్నారు.
చిన్నశేష వాహనం (ఉదయం 9 గం||ల నుండి 10 గం||ల వరకు) : సూర్యప్రభ వాహనంపై శ్రీసూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్న శేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలినీ యోగసిద్ధి ఫలం లభిస్తుందని ప్రశస్తి.
గరుడ వాహనం (ఉదయం 11 గం||ల నుండి 12 గం||ల వరకు) : స్వామివారికి ఎన్ని వాహనసేవలు ఉన్నా తన ప్రియమైన గరుడ వాహనసేవ లేనిదే పరిపూర్ణత చేకూరదు. అలంకారప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాలంకృతుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరువీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
హనుమంత వాహనం (మధ్యాహ్నం 1 గం|| నుండి మధ్యాహ్నం 2 గం||ల వరకు) : భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై పుణ్యక్షేత్ర మాడ వీధులలో ఊరేగి ఆశీర్వదించాడు.
ఈ కార్యక్రమాల్లో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి, బోర్డు సభ్యులు శ్రీ పార్థసారథి, శ్రీ మురళీకృష్ణ, శ్రీమతి ప్రశాంతిరెడ్డి, శ్రీ గోవిందహరి, ఇతర బోర్డు సభ్యులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.