FIVE DAY YAGAM CONCLUDES IN TIRUMALA _ శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలి- టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

TIRUMALA, 26 AUGUST 2023: The five-day Kareeristi-Varunajapa-Parjanyashanti Yagam which commenced with Ankurarpanam on August 22 concluded with Purnahuti on Saturday at Tirumala.

TTD Chairman Sri B Karunakara Reddy along with the TTD EO Sri AV Dharma Reddy participated on the final day event held at Dharmagiri Veda Vignana Peetham.

Dharmagiri Principal Sri KSS Avadhani recited the Kareeristi-Varunajapa-Parjanyashanti Mantras which were chanted by all.

Speaking on the occasion the TTD Chairman said seeking the benign blessings of Rain God to shower good rains and bestow prosperity on the humanity, 32 Ritwiks performed Kareeristi-Varunajapa-Parjanyashanti Yagam at Dharmagiri with utmost dedication and devotion.  

Health Officer Dr Sridevi, VGOs Sri Bali Reddy, Sri Giridhara Rao, faculty and students of Dharmagiri and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలి- టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

 తిరుమల, 2023 ఆగస్టు 26: ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కారీరిష్టి-వరుణ జపం- పర్జన్యశాంతి హోమం నిర్వహించామని, శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఐదు రోజుల పాటు జరిగిన యాగాలు శనివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి.

ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి టీటీడీ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ వరుణదేవుని ఆశీస్సులు కోరుతూ 32 మంది ఋత్వికులు ధర్మగిరిలో ఎంతో నిష్టగా, అత్యంత అంకితభావంతో యాగాలు నిర్వహించారని తెలిపారు.

అనంతరం ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కె.ఎస్.ఎస్.అవధాని కారీరిష్టి-వరుణజప-పర్జన్యశాంతి మంత్రాలను పఠించి అందరితో పలికించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమసలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజీఓలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్ రావు, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.