FIVE ELEMENTS OF NATURE DECIDES OUR DESTINIY _ పంచభూతాలను సక్రమంగా వినియోగించుకోవాలి : ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి
TIRUMALA, 16 OCTOBER 2023: Former Vice Chancellor of Somnath University in Gujarat, Acharya Vempati Kudumba Shastri informed that the Vedas proclaim the five elements of nature, viz. earth, water, fire, sky and air will decide the destiny of life only when properly used.
On the occasion of Navaratri Brahmotsavam, he delivered a discourse on Rigvedam-Samajika Pramodam at the Nada Neerajanam platform. Sri Sastri said that Panchabhutas are the source of nature and they should be protected. He said that our forefathers have provided all the things necessary for the development of human life through the Vedas. He complimented TTD for organising the Vidwat Sadas to impart Vedic knowledge for the future generations.
In this program, the Special Officer of the SV Institute of Higher Vedic Studies Dr Vibhishana Sharma and others participated.
పంచభూతాలను సక్రమంగా వినియోగించుకోవాలి : ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి
తిరుమల, 2023 అక్టోబర్ 16: పంచభూతాలైన నేల, నింగి, నీరు, నిప్పు, గాలిని సక్రమంగా వినియోగించుకోవాలని వేదాలు ఘోషిస్తున్నాయని గుజరాత్‌లోని సోమనాథ్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య వెంపటి కుటుంబశాస్త్రి తెలియజేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల నాదనీరాజన వేదికపై శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనివాస వేద విద్వత్ సదస్సు సోమవారం రెండో రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఆచార్య కుటుంబ శాస్త్రి మాట్లాడుతూ పంచభూతాలే ప్రకృతికి మూలమని, వీటిని రక్షించుకోవాలని సూచించారు. మానవజీవన వికాసానికి అవసరమైన అన్ని విషయాలను మన పూర్వీకులు వేదాల ద్వారా అందించారని తెలిపారు. వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందించేందుకు టీటీడీ వేద విద్వత్ సదస్సు నిర్వహించడం ముదావహమన్నారు.
ముందుగా వేదపండితులు నాలుగు వేదాల్లోని ఐదు శాఖలను పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డా. విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.