FIVE ROUNDS ON FLOAT_ వైభవంగా శ్రీ మలయప్పస్వామివారి తెప్పోత్సవం
Tirumala, 19 Mar. 19: The processional deity of Sri Malayappa Swamy accompanied by Sridevi and Bhudevi took celestial ride on float on Tuesday evening in Tirumala.
The penultimate day on Tuesday evening witnessed the deities taking five rounds on the Float in celestial waters of Swamy Pushkarini. The devotees were enthralled by the divine grace of the deities on Teppa.
CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath and were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
వైభవంగా శ్రీ మలయప్పస్వామివారి తెప్పోత్సవం
తిరుమల, 2019 మార్చి 19: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు మంగళవారంనాడు బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.
ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7.00 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదుమార్లు విహరించి భక్తులను కటాక్షించారు.
కాగా, చివరి రోజైన బుధవారం శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు ఏడుచుట్లు పుష్కరిణిలో తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.