FLORAL BATH RENDERED _ శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం
Tiruchanoor, 20 Nov. 20: Floral bath with tonnes of varieties of flowers has been performed to Goddess Sri Padmavathi Devi on Friday as part of annual pushpayagam.
The fete provided cynosure to devotees who witnessed live on SVBC. The Goddess seated on a special platform was rendered abhishekam with nearly four tonnes of different types of traditional, aromatic and ornamental flowers amidst chanting of vedic hymns by priests.
Earlier in the morning snapana tirumanjanam was held to the deity followed by procession of flowers from Vahana Mandapam to temple.
JEO Sri Basant Kumar, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, GM Transport Sri Sesha Reddy, Garden wing chief Sri Srinivasulu, DyEO Smt Jhansi Rani and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం
తిరుపతి, 2020 నవంబరు 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి శుక్రవారం మధ్యాహ్నం అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించింది.
వేడుకగా స్నపన తిరుమంజనం :
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
పుష్పయాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో రెండు టన్నులు తమిళనాడు, ఒక టన్ను కర్ణాటక, ఒక టన్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు అందించారు.
పుష్పాల ఊరేగింపు :
తొలుత మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో వాహన మండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, అర్చకులు ఆలయంలో ప్రదక్షణంగా తీసుకెళ్లారు.
అనంతరం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైదికులు వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, పగడపు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా ఈ పుష్పయాగ మహోత్సవం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ దంపతులు, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి దంపతులు, డిఎల్ వో శ్రీ రెడ్డప్ప రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, రవాణా విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విఎస్‌వో శ్రీ బాలి రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝూన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాసులు, సూపరింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.